బిగ్ బాస్ తెలుగు 8 నుంచి బేబక్క ఎలిమినేటెడ్.. ఏసియా నెట్ చెప్పిందే జరిగింది

First Published | Sep 8, 2024, 11:27 AM IST

తొలివారం నామినేషన్స్ లో విష్ణుప్రియ, పృథ్వీరాజ్, సోనియా , మణికంఠ, శేఖర్ భాషా, బేబక్క ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో సంచలన ఎలిమినేషన్ జరిగింది. ముందుగానే ఎలిమినేషన్ కి సంబంధించిన సమాచారం బయటకి వచ్చేసింది. తొలి వారం ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా.. కంటెస్టెంట్స్ కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా ఇలాంటి చర్చలు జరిగాయి. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి ఫస్ట్ ఎలిమినేషన్ కంప్లీట్ చేశారు. 

తొలివారం నామినేషన్స్ లో విష్ణుప్రియ, పృథ్వీరాజ్, సోనియా , మణికంఠ, శేఖర్ భాషా, బేబక్క ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. అయితే బేబక్క లేదా మణికంఠ ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరిగింది. ఏసియా నెట్ తెలుగు మాత్రం బేబక్క ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలిపింది. ఇప్పుడు అదే నిజమైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పడ్డ ఫస్ట్ వికెట్ బేబక్క. 


Bezawada bebakka

నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లలో బేబక్క కి తక్కువ ఓట్లు రావడంతో ఆమెని నాగార్జున ఎలిమినేట్ చేశారు. బేబక్క ముందు నుంచి డేంజర్ జోన్ లో ఉంటున్నారు. బేబక్క ఎలిమినేట్ కాబోతున్నట్లు ఏసియా నెట్ పోల్ లో కూడా తేలింది. బిగ్ బాస్ తెలుగు 8 - ఏసియానెట్ పోల్

బేబక్క ఎలిమినేషన్ కి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఆమె ఎక్కువగా కిచెన్ కే పరిమితం కావడం అని చెప్పొచ్చు. టాస్కుల్లో అవకాశం వచ్చినా సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయింది. వీక్ చివరికి వచ్చే సరికి కాస్త యాక్టివ్ అయింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నాగార్జున కూడా బేబక్క విషయంలో డిసప్పాయింట్ వ్యక్తం చేశారు. హౌస్ లో ఏమాత్రం యాక్టివ్ గా లేరని అన్నారు. 

ఫస్ట్ వీక్ లో సరిగ్గా పెర్ఫామ్ చేయని కంటెస్టెంట్ అంటే బేబక్క అనే చెప్పొచ్చు. ఆమె తర్వాత మణికంఠ, శేఖర్ భాషా లాంటి వాళ్ళు ఉన్నారు. మణికంఠ ఎమోషనల్ గా హైలైట్ అవుతూ వచ్చాడు. ఏదో విధంగా అతడు ఆడియన్స్ అటెన్షన్ ని పొందాడు. దీనితో ఫస్ట్ వీక్ లో సేఫ్ అయ్యాడు. 

నామినేషన్స్ లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్ లలో విష్ణుప్రియ, సోనియా ఆకుల మంచి ఓటింగ్ తో సేఫ్ అయ్యారు. పృథ్వీ కూడా ఈ వీక్ పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. కానీ సేఫ్ అయ్యాడు. బేబక్క ఎలిమినేట్ కావడంతో ఇక హౌస్ లో 13 మంది సభ్యులు ఉంటారు. 

Latest Videos

click me!