బిగ్ బాస్ హౌస్లోకి టేస్టీ తేజా? అలాగే శోభా శెట్టి, ఎంట్రీ ఇస్తున్న మాజీ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా?

First Published | Sep 8, 2024, 11:25 AM IST


బిగ్ బాస్ హౌస్లో కి మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తున్నారన్న న్యూస్ కాక రేపుతుండగా టేస్టీ తేజా ఎంట్రీ ఇస్తున్నాడట. ఆయనతో పాటు ఇంకెవరు వెళుతున్నారంటే...?
 

Bigg Boss Telugu 8


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇటీవల మొదలైంది. మొదటి వారం పూర్తి చేసుకుంది. 6 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. నాగ మణికంఠ, శేఖర్ బాషా, సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, విష్ణుప్రియ, పృథ్విరాజ్ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. 

అందుతున్న సమాచారం ప్రకారం బేబక్క ఎలిమినేట్ కానుందట. విష్ణుప్రియకు అత్యధికంగా ఓట్లు పడ్డాయట. అనంతరం నాగ మణికంఠకు ఓట్లు పడ్డాయట. పృథ్విరాజ్ మూడో స్థానంలో ఉన్నాడట. స్వల్ప ఓట్ల తేడాతో సోనియా ఆకుల, బేబక్క, శేఖర్ బాషా చివరి మూడు స్థానాల్లో ఉన్నారట. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారట. 
 

కాగా హౌస్లోకి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. మరో 5-6 కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్నారట. ఐదు వారాల అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయట. కాగా టేస్టీ తేజా హౌస్లోకి వస్తున్నాడు అనేది తాజా న్యూస్. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న టేస్టీ తేజా మంచి ఎంటర్టైనర్ గా పేరుగాంచాడు. 


Bigg Boss Telugu 7


టేస్టీ తేజా మొత్తంగా 9 వారాలు హౌస్లో ఉన్నాడు. జోక్స్ వేస్తూ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. హౌస్లో శోభా శెట్టి-టేస్టీ తేజా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. శోభా శెట్టి తన సాధక బాధలు టేస్టీ తేజాతో చెప్పుకునేది. సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు తగ్గిన నేపథ్యంలో టేస్టీ తేజాను రంగంలోకి దించుతున్నారట. 
 

Bigg Boss Telugu 7


అలాగే శోభా శెట్టి సైతం హౌస్లోకి వచ్చే అవకాశం కలదట. ఆమెను కూడా సంప్రదించారట. శోభా శెట్టి మరోసారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేందుకు పచ్చ జెండా ఊపిందట. శోభా శెట్టి దాదాపు 14 వారాలు హౌస్లో ఉంది. ఆమె మీద విపరీతమైన నెగిటివిటీ నడిచింది. అయినా స్ట్రాంగ్ ప్లేయర్ గా ఆమె ఫినాలే ముందు వరకు హౌస్లో ఉంది. 
 


టేస్టీ తేజ-శోభా శెట్టి హౌస్లోకి వెళ్లడం ఖాయం అంటున్నారు. యాంకర్ రవిని సంప్రదించారట. అయితే ఆయన నో చెప్పారట. యాంకర్ రవి సీజన్ 5లో పాల్గొన్నాడు. ఓ విషయంలో ఆయన నెగిటివిటీ అయ్యాడు. లహరి తన వెనుకబడుతుందని రవి చెప్పడం వివాదాస్పదం అయ్యింది. అందుకే ఆయన రాను అన్నారట. 

Bigg Boss Telugu Season 8


టేస్టీ తేజా, శోభా శెట్టితో పాటు కొందరు కంటెస్టెంట్స్ హౌస్లోకి రానున్నారట. ప్రస్తుతానికి 14 మంది ఉండగా 20-21 మంది కంటెస్టెంట్స్ తో షో నడపనున్నారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. 

Latest Videos

click me!