బావతో సింగర్ మంగ్లీ పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ సింగర్..

Published : Oct 05, 2023, 02:04 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో పుకార్లకు కొదవ లేదు. సెలబ్రిటీల మీద రకరకాల వార్తలు వండి వార్చుతుంటారు. అందులో కొన్ని నిజం అవుతంటాయి.. మరికొన్ని రూమర్స్ గానే మిగిలిపోతుంటాయి. ఈక్రమంలో సింగర్ మంగ్లీకి సబంధించిన ఓన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
15
బావతో సింగర్ మంగ్లీ పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ సింగర్..
Singer Mangli

సెలబ్రిటీల న్యూస్ అంటే చాలు అది వైరల్ అవ్వాల్సిందే.. అది ఏదైనా సరే.. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ల కు సబంధించిన ఏ న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్కంగా వాళ్ళ పెళ్లిళ్లకు సబంధించిన వార్తలు ఎక్కువగా షికారు చేస్తుంటాయి. ఈక్రమంలో...  ఇది ఇలా ఉంటే, కొన్ని రోజులు నుంచి మంగ్లీ పెళ్ళికి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. 

25

ఫోక్ సాంగ్స్ తో ఫేమస్ అయ్యి.. సినిమా పాటలతో సెలబ్రిటీగామారిపోయింది మంగ్లి. అయితే ఈ సింగర్ తన సొంత బావని పెళ్లాడబోతుంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన మేనబావతో కలిసి త్వరలోనే  ఏడడుగులు వేయబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. 
 

35

అయితే తాజాగా  ఈ వార్తలు పై మంగ్లీ.. స్పందించారు.. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయ్యింది.  మంగ్లీ  మాట్లాడుతూ.. ఓరి భగవంతుడా.. నాకు తెలియకుండానే నా పెళ్లి కూడా చేసేస్తున్నారా.. అంటూ తనదైన శైలిలో స్పందించింది. అంతే కాదు తన పెళ్లి విషయంలో క్లారిటీకూడా ఇచ్చింది బ్యాచిలర్ సింగర్. 

45
Singer Mangli

ఇంకా మంగ్లీ ఏమంటుందంటే..? నాకు పెళ్లి ఏంటి. ప్రెజెంట్ ఆ ఆలోచన ఏమి లేదు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. మా బావతో నేను ఏడడుగులు వేయబోతున్నాను అని రాసుకొస్తున్నారు కదా. నాకే తెలియని ఆ బావ ఎవరో కొంచెం నాకు కూడా చెబుతారా. అసలు ఈ పుకారు సృష్టించింది ఎవరు అంటూ వ్యాఖ్యానించింది. 
 

55
Singer Mangli

ప్రస్తుతం మంగ్లీ చేసిన వ్యాఖ్యలు.. ఇచ్చిన క్లారిటీతో.. మంగ్లీ పెళ్లి  వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది. ప్రస్తుతం వరుస పాటలతో దూసుకుపోతోంది మంగ్లీ. అటు సొంత ఆల్బమ్స్.. ఇటు సినిమా పాటలతో తెగ హడావిడి చేసేస్తోంది. 

click me!

Recommended Stories