Samantha: పెళ్లి చేసుకోకుండా అలా తల్లి కానున్న సమంత?

First Published | Nov 22, 2023, 7:32 AM IST

సమంత రూత్ ప్రభు పెళ్లి విషయంలో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 
 

Samantha Ruth Prabhu

సమంత రూత్ ప్రభు ఓ భిన్నమైన అమ్మాయి. చాలా విలక్షణంగా ఆలోచిస్తుంది. నచ్చినట్లు బ్రతకడమే లైఫ్. ఒకరి కోసం కాంప్రమైజ్ కాకూడదని నమ్ముతుంది. తన ప్రతి నిర్ణయంలో ఈ భావాలు కనిపిస్తాయి. సమాజం అనే ఛట్రం లో ఇరుక్కుపోయి జీవించడం సరికాదు అంటుంది. 

Samantha

ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి సమంత సూపర్ స్టార్ అయ్యింది. ఆమెకు ఇండియా వైడ్ ఫేమ్ వచ్చింది. 14 ఏళ్ల కెరీర్లో సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చింది. సమంత మొదటి సినిమా ఏమాయ చేసావే... 2010లో విడుదలైంది. 


గత రెండేళ్లుగా సమంత వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులకు లోనవుతుంది. భర్త నాగ చైతన్యతో విభేదాలు తల్తెట్టాయి. దాంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో నిందలు, ఆరోపణలు, సోషల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. మానసిక ఒత్తిడికి గురయ్యారు. సమంతను ఓ వర్గం కార్నర్ చేశారనే వాదన ఉంది. 

విడాకులు బాధ నుండి బయటపడగానే మరో సమస్య ఆమెను చుట్టుముట్టింది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఆమెనుకు సోకింది. ఏడాది కాలంగా ఈ వ్యాధికి సమంత చికిత్స తీసుకుంటుంది. ఇటీవల సమంత సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే సమంతకు పెళ్లీడు దాటిపోతుంది. ఆమె ప్రస్తుత వయసు 36 ఏళ్ళు. వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏజ్ బార్ అవుతుంది. ఈ క్రమంలో పేరెంట్స్ నుండి ఆమె మీద ఒత్తిడి ఉంది. వివాహం చేసుకుని సెటిల్ అవ్వు. నువ్వు లైఫ్ లో సక్సెస్ అనేది చూసేశావు అని సలహా ఇస్తున్నారట సన్నిహితులు. 

అయితే సమంతకు జీవితంలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదట. ఇకపై ఒంటరిగా ఉండిపోవాలి అనుకుంటున్నారట. మిగిలిన జీవితం నటనకు, సోషల్ వర్క్ కి ఉపయోగించాలని భావిస్తున్నారట. ఇక తల్లి కావాలన్న ఆశను వేరే మార్గంలో తీర్చుకుంటారట. ఆమె ఇద్దరు పిల్లలను భవిష్యత్ లో దత్తత తీసుకోవాలి అనుకుంటున్నారట. 


ఈ మేరకు టాలీవుడ్ లో వార్త చక్కర్లు కొడుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే ప్రముఖంగా వినిపిస్తోంది. సమంత 2014 నుండి ప్రత్యూష సపోర్ట్ పేరుతో ఓ ఛారిటీ సంస్థ నడుపుతుంది. ఈ సంస్థ తరపున మహిళలు, ఆడపిల్లల సంక్షేమానికి కృషి చేస్తుంది. కాబట్టి సమంత పిల్లలను దత్తత తీసుకుని అమ్మ అవుతారనే వాదన తెరపైకి వచ్చింది. 

Rakul and Samantha

మరోవైపు సమంత కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ప్రకటించలేదు. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ యాక్షన్ సిరీస్ వచ్చే ఏడాది ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. 

`జబర్దస్త్` రష్మితో పెళ్లి.. అమ్మాయిల హార్ట్ బ్రేక్‌ అయ్యే స్టేట్‌మెంట్‌ ఇచ్చిన సుడిగాలి సుధీర్‌..

Latest Videos

click me!