లావణ్య-వరుణ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి భారీగా ఏర్పాట్లు?... రాచరిక పద్దతిలో పెళ్లి, కారణం ఇదే!

Published : Aug 01, 2023, 04:48 PM IST

ఇటీవల లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. త్వరలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. 

PREV
15
లావణ్య-వరుణ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి భారీగా ఏర్పాట్లు?... రాచరిక పద్దతిలో పెళ్లి, కారణం ఇదే!

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కోడలు కానున్న విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్  తో ఏడడుగులు వేయనున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు. జూన్ 9న హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. కుటుంబ  సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. 

 

 

25

కాగా ఆగస్టులో పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేశారట. ఈ నెల చివరి వారంలో లావణ్య-వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కనున్నారనే వార్త గట్టిగా వినిపిస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకుంటున్నారట. ఇటలీ వేదికగా పెళ్లి జరగనుందట. ఇటలీని ఎంచుకోవడం వెనుక బలమైన కారణమే ఉందట. ఓ మూవీ షూటింగ్ లో భాగంగా ఇటలీ వెళ్లిన లావణ్య, వరుణ్ ప్రేమలో పడ్డారట. 

35

అందుకే ఇటలీని ఎంచుకున్నారట. మరో విశేషం ఏమిటంటే రాచరిక పద్దతిలో వీరి పెళ్లి జరగనుందట. లావణ్య త్రిపాఠి రాయల్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయట. అందుకే రాచరిక పద్దతిలో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే కొన్ని మ్యారేజ్ ప్లానింగ్ సంస్థలు పని స్టార్ట్ చేశాయట. లావణ్య, వరుణ్ కోరిక విధంగా పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నారట . 

45

కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పెళ్ళికి హాజరుకానున్నారట. ఒక 50 మంది మాత్రమే పాల్గొంటారని సమాచారం. పెళ్లి ముగిసిన వారం తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారట. మొత్తంగా ఊహించని రేంజ్ లో వరుణ్ తేజ్ పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. 

 

55

వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్నారు. వాటిలో గాండీవధారి అర్జున ఒకటి. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఇటీవల మట్కా టైటిల్ తో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. ఇక లావణ్య త్రిపాఠి నటనకు గుడ్ బై చెప్పారనే ప్రచారం జరుగుతుంది. ఆమె చేతిలో అధికారికంగా ఎలాంటి ప్రాజెక్ట్ లేదు. 
 

click me!

Recommended Stories