హ్యాపీ బర్త్ డే మృణాల్.. ఏడాదిలో బిజీయెస్ట్ హీరోయిన్ గా మరాఠి భామ.. ఇంట్రెస్టింగ్ గా నార్త్ టు సౌత్ జర్నీ..

First Published | Aug 1, 2023, 4:05 PM IST

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన మరాఠి భామ మృణాల్ ఠాకూర్ పుట్టిన రోజు ఇవ్వాళే. ఈ సందర్భంగా ఫ్యాన్స్,, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ స్పెషల్ డేన ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. 
 

Mrunal thakur

మరాఠి భామ మృణాల్ ఠాకూర్ (Murnal Thakur) ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. వరుస ప్రాజెక్ట్స్ లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్లోంది. నార్త్ నుంచి వచ్చి సౌత్ లో పాతుకు పోయిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. 
 

కాగా, ఈరోజు మృణాల్ ఠాకూర్ పుట్టిన రోజు కావడం విశేషం. 1992 ఆగస్టు 1న ఈ బ్యూటీ జన్మనించింది. మహారాష్ట్రలోనే పుట్టి పెరిగింది. అక్కడే తన విద్యాభ్యాసం కూడా పూర్తి చేసుకుంది. ఇక చదువుకునే రోజుల్లోనే మృణాలో సీరియల్స్ లో అవకాశం దక్కించుకుంది. అలా 2012లోనే సీరియల్ నటిగా కేరీర్ ను ప్రారంభించింది. పలు టీవీ షోల్లోనూ మెరిసి టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. 
 


Mrunal thakur

అలాగే 2014 నుంచి నటిగా వెండితెరపై అలరిస్తోంది. ‘విట్టి దండు’ అనే మరాఠ ఫిల్మ్ లోతొలిసారిగా లీడ్ రోల్ లో మృణాల్ నటించింది. ఆ తర్వాత నాలుగేళ్లకు హిందీలో ‘లవ్ సోనియా’ అనే మూవీలో నటించింది.  ‘సూపర్ 30’, ‘బట్ల హౌజ్’, ‘గోస్ట్ స్టోరీస్’, ‘తూఫాన్’, ‘ధమాఖ’, ‘జెర్సీ’ వంటి సినిమాల్లో మెరిసి నార్త్ ఆడియెన్స్ లో నటిగా గుర్తింపు దక్కించుకుంది.
 

Mrunal Thakur

కానీ మృణాల్ కు టాలీవుడ్ ఎంట్రీ తర్వాతే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కింది. ‘సీతారామం’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలవడం, సీత పాత్రలో మృణాల్ నటన అద్భుతమనిపించడంతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఈ ముద్దుగుమ్మను ప్రశంసించారు. ఆమె నటనకు మెచ్చుకున్నారు. మరోవైపు ఇండస్ట్రీలోనూ ఈ బ్యూటీ పేరు మారుమోగడం ప్రారంభమైంది. 
 

Mrunal thakur

ప్రస్తుతం ఏ క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతున్నా కథానాయికల విషయంలో మృణాల్ పేరును దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నారు. ‘సీతా రామం’ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ నేచురల్ స్టార్ నాని సరసన ‘హాయ్ నాన్న’తో అలరించేందుకు సిద్ధం అవుతోంది. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన VD13లోనూ నటిస్తోంది. మరోవైపు రవితేజ సినిమాలోనూ ఈ బ్యూటీ పేరు వినిపిస్తోంది. 

అలాగే తమిళంలో శివకార్తీకేయ నెక్ట్స్ భారీ చిత్రంతోనూ మృణాల్ ఠాకూర్ ఫైనల్ అయ్యిందని అంటున్నారు. ఏడాది కింద వరకు ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలియని స్థితి నుంచి ఇప్పుడిమే కావాలనే సిచ్యుయేషన్ క్రియేట్ చేసింది. సంవత్సరంలోనే నార్త్ నుంచి సౌత్ లో జెండా పాతి బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. ఇక ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడంతో ఆమె నటిస్తున్న సినిమాల నుంచి ఇంట్రెస్టింగ్ గా అప్డేట్స్ కూడా అందుతున్నాయి. 
 

Latest Videos

click me!