సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `కూలీ` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.300కోట్లు దాటి అందరిని ఆశ్చర్యపరిచింది.
రజనీకాంత్ నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ `కూలీ` మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, కేవలం మూడు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈ సినిమా మూడు రోజుల్లో రూ.320 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా, విదేశాల్లో ఈ చిత్రం 131.50 కోట్ల రూపాయలు వసూలు చేయడం విశేషం. ఓవర్సీస్‌లో దుమ్ములేపుతుంది.
DID YOU KNOW ?
విలన్‌గా నాగార్జున
`కూలీ` సినిమాలో మొదటిసారి నాగార్జున విలన్‌గా నటించారు. అయితే ఆయన పాత్రకి మిశ్రమ స్పందన లభిస్తోంది.
25
'వార్ 2'ని వెనక్కి నెట్టిన `కూలీ`
`కూలీ` ప్రపంచవ్యాప్త వసూళ్లను అదే సమయంలో విడుదలైన బాలీవుడ్ చిత్రం 'వార్ 2'తో పోలిస్తే, ఇది 100 కోట్ల రూపాయలకు పైగా అధికంగా ఉంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 215 కోట్ల రూపాయలు వసూలు చేసింది. విదేశాల్లో ఈ చిత్రం ఇప్పటివరకు కేవలం 45 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఈ లెక్కన రజనీ `కూలీ`.. `వార్ 2`ని గట్టి దెబ్బ కొడుతుందని చెప్పొచ్చు. డివైడ్ టాక్ వచ్చినా `కూలీ` బాక్సాఫీసుని షేక్ చేయడం విశేషం.
35
ఇండియాలోనూ `కూలీ` భారీ వసూళ్లు
`కూలీ` మూవీ భారత్‌లో అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. ప్రతిరోజూ వసూళ్లలో తగ్గుదల కనిపించినప్పటికీ, మూడు రోజుల్లో ఈ చిత్రం భారత్‌లో 159.25 కోట్ల రూపాయల నెట్, 188.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లో వరుసగా 65 కోట్లు, 54.75 కోట్లు , 39.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక్కడ కూడా 'వార్ 2' కంటే ముందంజలో ఉంది. 'వార్ 2' మూడు రోజుల్లో భారత్‌లో 142.60 కోట్ల రూపాయల నెట్, 170 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఆదివారం వరకే ఈ జోరు పరిమితమా? సోమవారం నుంచి కూడా అదే జోరు చూపిస్తుందా అనేది చూడాలి. సోమవారం నుంచి వచ్చే కలెక్షన్లని బట్టే ఈ చిత్రం ఫలితం ఆదారపడి ఉంటుంది.
రజనీకాంత్ మూడో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'కూలీ`
ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వద్ద `కూలీ` రజనీకాంత్ నటించిన అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా నిలిచింది. మొదటి స్థానంలో 2.0 ఉంది. 2018లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 675-700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రజనీకాంత్ నటించిన అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రం 2023లో వచ్చిన 'జైలర్'. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 605 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత `కూలీ` నిలిచింది. ఇది లాంగ్ రన్ లో వాటి రికార్డులు బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.
55
`కూలీ` బడ్జెట్, స్టార్ కాస్ట్ డిటెయిల్స్
`కూలీ` చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా, కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. దీని బడ్జెట్ సుమారు 350-400 కోట్ల రూపాయలు. అంటే, చిత్రం బడ్జెట్‌లో దాదాపు 40-45 శాతం వరకు వసూలు చేసింది. ఈ చిత్రంలో రజనీకాంత్ తోపాటు నాగార్జున, సోబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది.