నన్ను రీప్లేస్‌ చేయడానికి పది మంది యాంకర్లని మార్చారు.. టీవీ షోస్‌లో రియాలిటీ బయటపెట్టిన ఉదయభాను

Published : Aug 17, 2025, 04:28 PM IST

ఒకప్పుడు స్టార్‌ యాంకర్ గా రాణించింది ఉదయభాను. ఇప్పుడు మళ్లీ అడపాదడపా రచ్చ చేస్తోంది. ఈ క్రమంలో రియాలిటీ షోస్‌ల బండారం బయటపెట్టింది. తెరవెనుక నిజాలు వెల్లడించింది. 

PREV
15
బుల్లితెరని శాసించిన యాంకర్‌ ఉదయభాను

యాంకర్‌ ఉదయభాను ఒకప్పుడు స్టార్‌ యాంకర్‌గా రాణించింది. శ్రీముఖి, అనసూయ, రష్మిలు రావడానికి ముందే ఆమె బుల్లితెరని శాసించింది. అనేక షోస్‌ చేసి మెప్పించింది. యాంకర్‌ సుమకి గట్టి పోటీ ఇవ్వడమే కాదు, ఆమెని డామినేట్‌ చేసింది కూడా. కానీ ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఆమె యాంకరింగ్‌ మానేసింది. కొంత కాలం టీవీకి దూరంగా ఉంది. అయితే అప్పట్లో యాంకర్‌గానే కాదు, నటిగానూ అలరించింది. స్పెషల్‌ సాంగ్స్ కూడా చేసి మెప్పించింది.

DID YOU KNOW ?
రేలా రేలా రే
ఉదయభాను స్టార్ మాలో ప్రసారం అయిన `రేలా రేలా రే` అనే పాటల ప్రోగ్రామ్‌కి వ్యాఖ్యతగా చేసింది. ఈ షో ద్వారా ఎంతో మంది సింగర్స్ పరిచయం అయ్యారు. ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు.
25
`బార్బరిక్‌` మూవీతో రాబోతున్న ఉదయభాను

కొంత కాలం అన్నింటికి దూరంగా ఉన్న ఉదయభాను గత కొన్ని రోజుల క్రితం మళ్లీ కమ్‌ బ్యాక్‌ అయ్యింది. ఇప్పుడు అడపాదడపా టీవీ షోస్‌తో మెప్పిస్తోంది. ఈ క్రమంలో యాంకర్‌గానే కాదు, నటిగానూ అలరించేందుకు వస్తోంది. తాజాగా ఆమె `బార్బరిక్‌` అనే సినిమాలో నటించింది. సత్యరాజ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను పంచుకుంది. రియాలిటీ షోస్‌ గురించి ఓపెన్‌ అయ్యింది ఉదయభాను.

35
`ఢీ` షోలో ఉదయభాను ప్లేస్‌ భర్తీ కోసం పది మంది యాంకర్ల మార్పు

తాను అప్పట్లో చేసిన ప్రతి షోలోనూ తన మార్క్ వేశానని తెలిపింది ఉదయభాను. `రేలా రేలా రే` షోలో తన మార్క్ ఉంటుందని, దాన్ని ఎవరూ రీప్లేస్‌ చేయలేకపోయారని చెప్పింది. ఎన్ని షోస్‌ వచ్చినా అది అలా నిలిచిపోయిందని, అలాగే `ఢీ` షో చేశానని, తాను వెళ్లిపోయాక తన ప్లేస్‌ భర్తీ చేయడానికి పది మంది యాంకర్లని మార్చాల్సి వచ్చిందని చెప్పింది ఉదయభాను. ఇలా ప్రతి షోలోనూ తన మార్క్ ఉంటుందని వెల్లడించింది.

45
రియాలిటీ షోస్‌లో రియాలిటీ బయటపెట్టిన ఉదయభాను

అదే సమయంలో రియాలిటీ షోస్‌లో రియాలిటీ ఎంత ఉంటుందో బయటపెట్టింది. ఒకప్పుడు రియాలిటీగా ఇలాంటి రియాలిటీ షోస్‌ ఉండేవని, కానీ ఇప్పుడు అంతా స్క్రిప్టెడ్‌ అని చెప్పింది. వెనకాల ఇయర్‌ ఫోన్స్ పెట్టుకొని ఓ వ్యక్తి ఉంటాడని, ఎప్పుడు ఏ డైలాగ్‌ చెప్పాలో అతనే నిర్ణయిస్తాడని, ఆయన చెప్పిన్నట్టు మనం చేయాలని, ఒక డైలాగ్‌ చెప్పాలన్నా, నవ్వాలన్నా, ఏడవాలన్నా ఆయన చేతుల్లోనే ఉంటుందని తెలిపింది. మొత్తం స్క్రిప్టెడ్‌ అని, తాను ఇలాంటి ఇయర్‌ ఫోన్స్ లేని సమయంలో యాంకర్‌గా చేసినందుకు సంతోషంగా ఉందని చెప్పింది.

55
బౌన్స్ అయిన చెక్కులు తోరణాలు

ఇప్పుడు రియాలిటీ షోస్‌ చేయాల్సి వస్తే చేస్తారా? అని యాంకర్‌ ప్రశ్నించగా, ఇటీవల తాను రెండు షోస్‌ చేశానని, ఆ తర్వాత రియలైజ్‌ అయ్యానని తెలిపింది. మనకు చెప్పే వ్యక్తికి ఒక క్యారెక్టర్‌ ఉండాలని తెలిపింది ఉదయభాను. అదే సమయంలో అప్పట్లో తాను ఎక్కువగా రియాలిటీ షోస్‌ చేసి మెప్పించిన నేపథ్యంలో బాగా పారితోషికం తీసుకునే యాంకర్‌గా రాణించింది. దీనిపై ఆమె స్పందిస్తూ, తనుపై అలాంటి పేరు పడిపోయిందని, కానీ ఈ షోస్‌ వాళ్లు ఇచ్చిన చెక్కులు చాలా బౌన్స్ అయ్యానని, ఎంతో మంది మనీ ఎగ్గొట్టారని తెలిపింది. ఆ బౌన్స్ అయిన చెక్కులు చూస్తే తోరణాలు కట్టుకోవచ్చు అని చెప్పింది ఉదయభాను. తాను ఇతర షోస్‌ ద్వారా సంపాదించానని వెల్లడించింది. తాజాగా ఉదయభాను కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories