సౌందర్య మరణం అతనికి ముందే తెలుసా..? ఎవరా వ్యక్తి, నిజమెంత..?

First Published | Sep 8, 2024, 6:00 PM IST

హీరోయిన్ గా ఎంతో భవిస్యత్తు ఉండి..  చాలా చిన్నవయస్సులో  మరణించింది నటి సౌందర్య. అయితే ఆమె మరణం గురించి ముందే తెలుసా..? అలా తెలిసిన వ్యక్తి ఎవరు..?ఇందులో నిజం ఎంత..? 

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  సావిత్రి తరువాత అంతటి పేరు సంపాదించుకున్న నటి సౌందర్య. అందం, నటనతో పాటు..అద్భుతమైన వ్యక్తిత్వంకూడా కలిగిన తార ఆమె. మరీ ముఖ్యంగా వల్గారిటీకి చాలా దూరంగా.. ఫ్యాషన్ డ్రస్సులు వేయకుండానే స్టార్ హీరోయిన్ స్థాయిని చేరింది సౌందర్య. చీరకట్టుతోనే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అందమైన చిరునవ్వుతో అభిమానులను ఆకర్షించిన నటి సౌందర్య. బెంగళూరుకు చెందిన ఆమె కన్నడ కుటుంబంలో పుట్టి పెరిగింది.  1972లో జన్మించిన సౌందర్య కన్నడ సినిమాల్లో నటిస్తూ.. టాలీవుడ్  అవకాశాలు సాధించింది. తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా వెలుగు వెలిగింది. సౌత్ ఇండస్ట్రీని ఏలిన నటి సౌందర్య. 

సర్వేపల్లి రాధాకృష్ణన్ తో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా..? ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..


 తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె.. దక్షిణ భారత భాషలలో వెలుగు వెలిగింది.  90వ దశకంలో సౌత్ ఇండియన్ సినిమాకు స్టార్ హీరోలుగా ఉన్న  చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, మోహాన్ లాల్, వెంకటేష్,  నాగార్జున, లతో పాటు శ్రీకాంత్, జగపతిబాబులాంటి స్టార్స్ తో కూడా ప్యామిలీ మూవీస్ లో నటించి మెప్పించింది. 

అదేవిధంగా సౌందర్య తన 20 ఏళ్ల స్క్రీన్ కెరీర్‌లో సౌత్ ఇండియా టాప్ నటిగా ఎదిగింది. సౌత్ లో మాత్రమే కాదు.. అటు  బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ సరసన సూర్యవంశ్ సినిమాలో దేవయాని పాత్రను పోషించింది. అమితాబ్ బచ్చన్ సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో హిందీ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. 

చిరంజీవి కెరీర్ లో 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఏదో తెలుసా..?
 

సమయంలో కన్నడ, తమిళం, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న సౌందర్య.. బాలీవుడ్  సినిమాలు చేయలేకపోయింది. ఇక హీరోయిన్ గా సినిమాలు తగ్గుతున్న టైమ్ లో సౌందర్య విమెన్ సెంట్రిక్ మూవీస్ వైపు చూసింది.

కొన్ని సినిమాలు చేసినా.. అవి పెద్దగా హిట్ అవ్వలేదు. దాంతో ఆమె రాజకీమాల వైపు చూసింది. సినిమాలు తగ్గుతున్న టైమ్ లో.. రాజకీయాల్లో రాణించాలని అనుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో  ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేసింది.  

2004లో బీజేపీలో చేరిన  సౌందర్య..  17 ఏప్రిల్ 2004న,  పార్టీ ప్రచారంతో పాటు.. ఓట్లు సేకరించేందుకు తన సోదరుడు అమర్‌నాథ్‌తో కలిసి హెలికాప్టర్ లో బయలు దేరి..  ప్రమాదంలో మరణించింది. 

బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఎవరు..?

ఎక్కడైతే  హెలికాప్టర్ పైకి ఎగిరిందో.. అక్కడే  సాంకేతిక లోపంతో పేలిపోవడంతో సౌందర్య మరియు ఆమె సోదరుడు  ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ దేశాన్ని విషాదంలో ముంచెత్తింది. సౌందర్య అభిమానులను కలచివేసింది.

ఈ నిజాన్ని జీర్ణించుకోవడం కోసం ఫ్యాన్స్ కు చాలా టైమ్ పట్టింది. అప్పటికే పెళ్ళైన సౌందర్య.. మరణించే సమయానికి  గర్భవతి కావడంతో ఈ విషయంలో అభిమానులను మరింత మనో వేదనకు గురిచేసింది.

ఇక ఈక్రమంలోనే అప్పట్లో ఓ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. సౌందర్య చనిపోతుంది అన్న విషయం ఓ వ్యక్తికి తెలుసని..? గట్టిగా ప్రచారం జరిగింది ఇంతకీ అతను ఎవరో కాదు ఆమె తండ్రి. 

బాయ్ ఫ్రెండ్ కి బిగ్ షాక్ ఇచ్చిన తమన్నా.. విజయ్ వర్మ నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

అవును సౌందర్య జాతకం ప్రకారం ఆమె మరణిస్తుందని జ్యోతీష్కులు ముందే తన తండ్రికి చెప్పారని. కాని అప్పుడు ఆయన ఈ విషయాన్ని పెద్దగా నమ్మలేదని.. పట్టించుకోలేదని రూమర్ బాగా స్ప్రెడ్ అయ్యింది. అసలు ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం ఈ గాసిప్ హల్ చల్ చేసింది. 

ఏది ఏమైనా.. అంతటి అద్బుతమైన నటి.. మంచి మనసున్న తార చాలా చిన్న వయస్సులో మరణించడం  చాలా బాధాకరం. ఇక సౌందర్య మరణించి ఈ ఏడాదికి 20 ఏళ్ళు అవుతుంది. అయినా ఆమె అభిమానుల గుండెల్లో పదిలంగానే ఉంది. ఆమె సినిమాలు చూస్తున్నంతసేపు మదిలో మెదులుతూనే ఉంటుంది. 

Latest Videos

click me!