మనోజ్ తో విబేధాలు... విష్ణు సమాధానం ఏమిటో తెలుసా? 

First Published | Sep 8, 2024, 6:00 PM IST


మంచు బ్రదర్స్ మనోజ్-విష్ణు మధ్య విబేధాలు ఉన్నాయనే ఓ వాదన ఉంది. ఈ కామెంట్స్ పై ఓ సందర్భంలో మంచు విష్ణు స్వయంగా స్పందించారు. 

once manchu vishnu opens up on differences with brother manoj ksr
Manchu Vishnu

నటుడు మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ మధ్య వివాదాలు తలెత్తాయనే వాదన చాలా కాలంగా ఉంది. మనోజ్ ఆ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయాడు. చెన్నైలో మౌనికతో పాటు కొన్నాళ్ళు రహస్యంగా ఉన్నట్లు మనోజ్ ఓ షోలో స్వయంగా వెల్లడించారు.  భూమా మౌనిక రెడ్డిను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు, విష్ణుకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. 
 


మనోజ్ వివాహాన్ని అక్క మంచు లక్ష్మి దగ్గరుండి జరిపించింది. 2023 మార్చి నెలలో మౌనిక-మనోజ్ పెళ్లి చేసుకున్నారు. మంచు లక్ష్మి నివాసంలో ఈ పెళ్లి జరగ్గా... విష్ణు హాజరయ్యారు. అయితే ఆయన వెంటనే వెళ్లిపోయారని సమాచారం. మోహన్ బాబు సైతం చివరి నిమిషంలో వచ్చాడు. నూతన దంపతులను ఆశీర్వదించాడు. 
 



మనోజ్ వివాహం అనంతరం విష్ణు తన మనుషులపై దాడి చేస్తున్నాడని మనోజ్ ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది క్షణాల్లో వైరల్ అయింది. మంచు బ్రదర్స్ మధ్య విబేధాల పుకార్లకు ఆ వీడియో బలం చేకూర్చింది. మనోజ్ వెంటనే ఆ వీడియో డిలీట్ చేశాడు. 

ఆ వీడియో ఓ గేమ్ షోలో భాగం, ఫ్రాంక్ అని మంచు విష్ణు తెలియజేశాడు. ఈ సంఘటన  జరిగి ఏడాది గడుస్తున్నా మంచు బ్రదర్స్ మధ్య ఏర్పడిన విబేధాలు సమసిపోలేదని సోషల్ మీడియా టాక్. మంచు మనోజ్ కి ఇటీవల అమ్మాయి పుట్టింది. ఆ పాపకు బారసాల నిర్వహించారు. 'దేవసేన శోభ ఎంఎం' అని నామకరణం చేశారు. 
 

ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులైన మోహన్ బాబు, నిర్మల, మంచు లక్ష్మికి మనోజ్ కృతజ్ఞతలు తెలిపాడు. విష్ణు పేరును మాత్రం విస్మరించాడు. సోషల్ మీడియా నోట్ లో విష్ణు ప్రస్తావన లేదు. కావాలనే మనోజ్ అన్నయ్య విష్ణు పేరు పొందుపరచలేదని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
 

Manchu Vishnu

అలాగే ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి చైల్డ్ అబ్యూస్ కి పాల్పడ్డాడు. దీని మీద సాయి ధరమ్ తేజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మనోజ్ సైతం ప్రణీత్ హనుమంతు చర్యను ఖండిస్తూ ట్వీట్ చేశాడు. సాయి ధరమ్ ని బ్రదర్ అంటూ మెచ్చుకున్న మంచు విష్ణు, మనోజ్ ట్వీట్ పై స్పందించలేదు.


ఈ పరిణామాలు గమనించిన టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. మనస్పర్థలు అలానే ఉన్నాయని అంటున్నారు. అయితే ఇవన్నీ అపోహలు మాత్రమే. ప్రచారం జరుగుతున్నట్లు మంచు బ్రదర్స్ విడిపోలేదు. తమ తమ పనుల్లో బిజీగా ఉంటున్నారని, అందుకే కలవడం లేదంటున్నారు సన్నిహితులు. 


ఈ వివాదం పై మంచు విష్ణు ఓ సందర్భంలో స్వయంగా స్పందించాడు. ఆలీ తో సరదాగా షోలో పాల్గొన్న మంచు విష్ణు ఈ మేరకు ఓ కామెంట్ చేశాడు. హోస్ట్ ఆలీ నేరుగా మంచు విష్ణును ఈ ప్రశ్న అడిగారు. మీ తమ్ముడితో మీకు గొడవలు అట కదా? అని అడగ్గా... విష్ణు ఒకింత ఆలీని భయపెట్టాడు. 


విష్ణు మాట్లాడుతూ... ఇవన్నీ నిరాధార కథనాలు. నేను నాన్నతో ఉంటాను. అక్క, మనోజ్ వేరు వేరుగా ఉంటారు. చాలా కాలంగా మేము విడివిడిగా ఉంటున్నాము. దానికి మా మధ్య విబేధాలు అంటూ సృష్టించారని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.. 

Latest Videos

click me!