Bigg boss Season 6: కరాటే కళ్యాణి వివాదం... ఆ యూట్యూబర్ కి బిగ్ బాస్ ఛాన్స్!

Published : May 18, 2022, 06:25 PM IST

వివాదాలతో ఫేమస్ అవుతున్న కొందరి జీవితాలు మారిపోతున్నాయి. సోషల్ మీడియా స్టార్స్ కాస్తా బుల్లితెరకు ప్రమోట్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరగ్గా... కరాటే కళ్యాణి ఉదంతంతో యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఫేమస్ అయ్యాడు.

PREV
16
Bigg boss Season 6: కరాటే కళ్యాణి వివాదం... ఆ యూట్యూబర్ కి బిగ్ బాస్ ఛాన్స్!
Bigg boss Telugu

తెలుగు రాష్ట్రాల్లో కరాటే కళ్యాణి (Karate Kalyani) -శ్రీకాంత్ రెడ్డి వివాదం హాట్ టాపిక్. తనతో అసభ్యంగా ప్రవర్తించాడనే నెపంతో కరాటే కళ్యాణి అతడిపై దాడి చేసింది. శ్రీకాంత్ బట్టలు చిరిగేలా కొట్టింది. ఈ గొడవ లీగల్ టర్న్ తీసుకుంది. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ వివాదంలో తప్పెవరిదైనా కానీ.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. 
 

26
Bigg boss Telugu

అనంతరం కరాటే కళ్యాణి మరోవివాదంలో చిక్కుకొంది. ఈ వివాదంతో ఒకప్పుడు కేవలం యూట్యూబ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన శ్రీకాంత్ (Srikanth reddy)ఇప్పుడు ఫుల్ ఫేమస్ అయ్యాడు. అసలు ఎవరీ శ్రీకాంత్ అని జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు.కాగా శ్రీకాంత్ గురించి చెప్పాలంటే ఇతనో యూట్యూబర్. తన యూట్యూబ్ ఛానల్ లో ఫ్రాంక్ వీడియోలు ప్రసారం చేస్తాడు. 
 

36
Bigg boss Telugu

ఒంటరిగా ఉన్న మహిళలతో మాట్లాడడం, వాళ్ళను తనవైపు తిప్పుకోవడం ఇతని ఫ్రాంక్ వీడియో కాన్సెప్ట్స్ గా ఉంటాయి. అక్కడ జరిగేదంతా స్క్రిప్ట్ నా లేక నిజంగానే పరిచయం లేని మహిళలతో అతడు అలా మాట్లాడతాడా అనేది ఎవరికీ తెలియదు. విషయం ఏదైనా శ్రీకాంత్ వీడియోలకు డిమాండ్ ఉంది. ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు. 
 

46
Bigg boss Telugu

ఇక కరాటే కళ్యాణి వివాదం ఇతడికి ఓ బంపర్ ఆఫర్ తెచ్చిపెట్టినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 6 (Bigg boss Season 6) కి రంగం సిద్ధం అవుతుంది. దేశం కరోనా పరిస్థితుల నుండి బయటపడిన నేపథ్యంలో లేటెస్ట్ సీజన్ కి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. 
 

56
Bigg boss Telugu

కాగా యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నారట. బిగ్ బాస్ 6లో శ్రీకాంత్ రెడ్డి సందడి చేయడం ఖాయమంటున్నారు. ఇదే నిజమైతే అతడి కెరీర్ కి బ్రేక్ వచ్చినట్లే. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ రాబట్టిన చాలా మంది కంటెస్టెంట్స్ బుల్లితెరపై రాణిస్తున్నారు. యాంకర్స్ గా, కమెడియన్స్ గా వెలుగిపోతున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ సైతం మంచి కెరీర్ నిర్మించుకునే సూచనలు కలవు. 
 

66
Bigg boss Telugu

మరి దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. బిగ్ బాస్ నాన్ స్టాప్ చివరి దశకు చేరుకుంది. దీనికి కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా... బిగ్ బాస్ సీజన్ 6 హోస్ట్ చేస్తాడో లేదో చూడాలి. 
 

Read more Photos on
click me!

Recommended Stories