అయితే ఇందుకోసం ప్రత్యేకంగా భారత ప్రభుత్వం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సారథ్యంలో ఇండియన్ సినీ ప్రముఖులు హాజరు కావడం విశేషం. అనురాగ్ టీమ్‌లో నవాజుద్దిన్ సిద్ధిఖీ, మాధవన్, దర్శకుడు, నటుడు శేఖర్ కపూర్, సంగీత దర్శకుడు రిక్కీ కేజ్, సీబీఎఫ్‌సి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) చైర్ పర్సన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్‌సి సభ్యురాలు వాణీ త్రిపాఠి, ఆస్కార్ విన్నర్ రెహ్మాన్ పాల్గొన్నారు. వీరితోపాటు అక్షయ్ కుమార్ కూడా హాజరు కావాల్సి ఉండగా, ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన టూర్ క్యాన్సిల్ అయ్యింది.