వివాదాస్పద నటి వనిత హీరోయిన్ గా రీఎంట్రీ... హీరో ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే!

First Published Feb 27, 2021, 6:09 PM IST

ప్రముఖ నటుడు విజయ్ కుమార్ పెద్ద కూతురు వనితా విజయ్ కుమార్ వివాదాలతో ఎప్పుడూ వార్తలలో ఉంటారు. రెండు పెళ్లిళ్లు చేసుకొని పెటాకులు చేసుకున్న వనితా, ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. 
 

నిర్మాత పీటర్ పాల్ తో ఆమెకు మూడవ వివాహం జరిగింది. నెలల వ్యవధిలోనే ఆమె మూడో భర్తకు కూడా టాటా బై బై చెప్పేసింది. అలాగే ఆ మధ్య మరలా ప్రేమలో పడ్డట్టు వార్త పేల్చి, సంచలనానికి తెరలేపింది.
undefined
ఇక నటిగా కొన్ని చిత్రాలలో నటిస్తోన్న వనిత, బుల్లితెర షోలలో కనిపిస్తున్నారు. వనితా బిగ్ బాస్ తమిళ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.
undefined
అయితే అనూహ్యంగా వనిత మళ్లీ హీరోయిన్‌గా మారుతున్నట్లు సోషల్ మీడియా ప్రకటన చేసి, అందరికీ షాక్ ఇచ్చారు. ఈ వయసులో ఆమెను హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తున్న నిర్మాత ఎవరు, హీరో ఎవరనే సందేహం అందరిలో మొదలైపోయింది.
undefined
విషయంలోకి వెళితే 2కే అళగనాదు కాదల్ అనే చిత్రంలో వనిత హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.
undefined
శరీరమంతా బంగారు నగలతో గోల్డ్ మ్యాన్ గా పాపులర్ అయిన హరి నాడార్ ఈ మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. 2కె అళగనాదు కాదల్ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే కావడం మరో విశేషం.
undefined
ఇక మూవీ లాంఛింగ్ ఈవెంట్ చెన్నై లో గ్రాండ్ గా జరిగింది. తన కొత్త మూవీ విశేషాలు వనితా సోషల్ మీడియాలో వెల్లడించారు.ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేశారు ఆమె. వారెన్ వీజే చార్లీ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
undefined
మరి త్వరలో షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్ర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా మరలా హీరోయిన్ గా సినిమా తీస్తూ వార్తలలో నిలిచింది వనిత.
undefined
click me!