Rashmika Mandanna : ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్ రష్మికపై కర్ణాటక ఎమ్మెల్యే రవి గనిగ మండిపడ్డారు. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమను గౌరవించడం లేదని, అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి హాజరు కాలేదని విమర్శించారు.
Congress MLA threatens Rashmika Mandanna in telugu
Rashmika Mandanna : ప్రస్తుతం ఆల్ ఇండియాలో వన్ ఆఫ్ ది ట్రెండింగ్ హీరోయిన్ రష్మిక. సక్సెస్, ఫెయిల్యూర్ కు సంభందం లేకుండా ఈమె గురించి జనాలు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. అప్పుడప్పుడూ ఫన్నీ ట్రోల్స్ లాంటివి కూడా చేస్తుంటారు.
అల్లు అర్జున్ 'పుష్ప' రిలీజ్ తర్వాత మాత్రం ఈమెకు పాన్ ఇండియా లెవల్లో ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలోనే దక్షిణాదితోపాటు హిందీలోనూ నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అదే సమయంలో వివాదాల్లోనూ ఇరుక్కుంటోంది. తాజాగా ఆమెపై పై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ మండిపడ్డారు.
24
Congress MLA threatens Rashmika Mandanna in telugu
రష్మిక తీరును విమర్శిస్తూ తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆమె అంగీకరించలేదని ఆరోపించారు. ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. కెరీర్‌ను ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం ఆమె తెలుసుకోవాలని తెలిపారు.
34
Congress MLA threatens Rashmika Mandanna in telugu
ఎమ్మల్యే రవి మాట్లాడుతూ..‘‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో ఈ రాష్ట్రంలోనే తన కెరీర్‌ను ప్రారంభించారు నటి రష్మిక. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కావాలని కోరుతూ గతేడాది మేము ఎన్నోసార్లు ఆమెను సంప్రదించాం. ఆమె రానని.. కర్ణాటక వచ్చేంత సమయం తనకు లేదని చెప్పింది.
అంతేకాకుండా, మా ఇల్లు హైదరాబాద్‌లో ఉంది. కర్ణాటక ఎక్కడో నాకు తెలియదు అన్నట్లు ఆమె మాట్లాడింది. నాకు తెలిసిన మరి కొంతమంది కూడా సుమారు పదిసార్లు ఆమెను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కానీ ఆమె మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. కన్నడ చిత్రపరిశ్రమ, భాష పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు సరైన పాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?’’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
44
Congress MLA threatens Rashmika Mandanna in telugu
మరో ప్రక్క బెంగళూరు వేదికగా జరుగుతోన్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో నటీనటులు పాల్గొనకపోవడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘నటీనటులు, దర్శక నిర్మాతలు ఒకే తాటి మీదకు రావాలి. రాష్ట్రంలో జరిగిన కీలక కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలా కానిపక్షంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వల్ల ప్రయోజనం ఏమిటి? సినిమా పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు కూడా ఎంతో అవసరం అని అందరూ గుర్తుంచుకోవాలి’’ అని వ్యాఖ్యలు చేశారు. నటీనటుల తీరు మారకపోతే వారిని ఏవిధంగా సరిచేయాలో కూడా తనకు తెలుసన్నారు.