తెలుగు సినిమా చరిత్రలో దిగ్గజాలు ఎన్టీఆర్, ఏఎన్నార్. వీళ్ళిద్దరూ సహచరులు మాత్రమే కాదు మంచి స్నేహితులు కూడా. మాయాబజార్, గుండమ్మ కథ, తెనాలి రామకృష్ణ ఇలా చాలా చిత్రాల్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ కలసి నటించారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో అనేక క్లాసిక్ చిత్రాలు ఇప్పటికీ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటాయి.