Comrade Kalyan Day 1 Collections: ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా నిలిచిన శ్రీవిష్ణు తాజాగా `కామ్రేడ్ కళ్యాణ్` చిత్రంలో నటించాడు. నక్సల్ బ్యాక్ డ్రాప్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తోంది.
కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ రాణిస్తోన్న యంగ్ హీరో శ్రీవిష్ణు ఇప్పుడు `కామ్రేడ్ కళ్యాణ్` అనే చిత్రంలో హీరోగా నటించాడు. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంతో రూపొందిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పణలో స్కంధ వాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించారు. ఇందులో మహిమా నంబియర్ హీరోయిన్‌గా నటించగా, రాధికా శరత్ కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమయే, సత్య, సుదర్శన్, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగర్, సాయి చంద్, శత్రు కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. మరి బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాన్ని రాణిస్తుందనేది చూద్దాం.
24
కామ్రేడ్ కళ్యాణ్ కలెక్షన్లు
`కామ్రేడ్ కళ్యాణ్` మూవీ బాక్సాఫీసు వద్ద కూడా మిక్స్ డ్ గానే సందడి చేసింది. శ్రీవిష్ణు గత చిత్రం కంటే బెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. అయితే తన కెరీర్‌లో హైయ్యెస్ట్ తో పోల్చితే డల్‌గానే స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.2.40కోట్ల కలెక్షన్లని సాధించింది. రూ.2.10కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. కోటీ వరకు షేర్ వచ్చింది. అయితే శ్రీవిష్ణు గత చిత్రం `మృత్యుంజయ`తో పోల్చితే ఇది బెస్ట్ ఓపెనింగ్ గా చెప్పొచ్చు. ఆ సినిమాకి రెండు కోట్ల లోపే వచ్చాయి. అదే సమయంలో ఆయన హీరోగా వచ్చిన `సింగిల్` మూవీ మాత్రం ఏకంగా రూ.4.15కోట్లు, `విష్ణు విన్యాసం` రూ.3.95కోట్లని రాబట్టాయి. వాటితో పోల్చితే ఇది వెనకబడింది.
ఇక `కామ్రేడ్ కళ్యాణ్` మూవీ బడ్జెట్, బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తే, ఈ చిత్రానికి సుమారు రూ.22కోట్ల బడ్జెట్ అయ్యిందట. ప్రమోషన్స్ తో కలుపుకొని. సినిమాకి థియేట్రికల్‌గా అయిన బిజినెస్ రూ.11కోట్లు అని సమాచారం. అంటే దాదాపు రూ.22కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావాలి. కానీ ఇప్పుడు అందులో కేవలం 10శాతం మాత్రమే వసూలు చేసింది. ఇంకా 90శాతం రావాలి. అలా ఇరవై కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. అయితే ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. శనివారం నుంచి పుంజుకుంటే ఇది పెద్ద లెక్క కాదు, కానీ పుంజుకోలేదంటే కష్టమనే చెప్పాలి. అయితే శనివారం నుంచి స్కూల్స్, కాలేజీలకు సెలవులు. దీంతో కలెక్షన్లు పెరిగే ఛాన్స్ కనిపిస్తున్నాయి. మరి ఎంత వరకు సత్తా చాటుతుందో చూడాలి. ఈ సినిమా ఏం చేసినా ఈ వారంలోనే రాబట్టాలి, మళ్లీ గురువారం నుంచి పెద్ద సినిమాలున్నాయి. థియేటర్ల నుంచి ఎత్తేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఐదు రోజులు ఈ సినిమాకి చాలా కీలకం.
కామ్రేడ్ కళ్యాణ్ మూవీని లవ్‌స్టోరీకి, నక్సల్స్ కి ముడిపెట్టి రూపొందించారు. హీరో పాత థియేటర్‌ని నడిపిస్తుంటాడు. అందులో ఆర్ నారాయణమూర్తి సినిమాలు వేస్తుంటారు. అక్కడ నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అందుకే ఆయా సినిమాలు బాగా ఆడుతుంటాయి. ఈ క్రమంలో హీరోయిన్ పరిచయం అవుతుంది.ఆమెని పడేయాలని ప్లాన్ చేస్తాడు. అయితే ఆమెకి ఒక సమస్య ఉంటుంది. అప్పుల వాళ్లు వేధిస్తుంటారు. తన లవర్ కోసం తాను అప్పు కడతానని చెప్పి అన్నల్లోకి వెళ్తాడు. డ్రామా రూపంలో వెళ్లి నిజంగానే నక్సల్‌గా మారాల్సి వస్తుంది. దీంతో పోలీసుల హిట్ లిస్ట్ లో ఉంటాడు. మరోవైపు వీడు నకిలీ నక్సల్ అని అన్నలకు తెలుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య ఎలా నలిగిపోయాడు? ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు, తన ప్రియురాలిని ఎలా దక్కించుకున్నాడనేది ఈ సినిమా కథ. ఆద్యంతం ఫన్ ప్రధానంగా సాగుతుంది.కానీ ఆ ఫన్ ఆశించిన స్థాయిలో పండలేదనే ఫీలింగ్ ఉంది. ఎమోషన్స్ కూడా లేవనే టాక్ వినిపించింది.