Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ

Published : Oct 09, 2026, 10:50 PM IST

బిగ్ బాస్ హౌస్ లో 33 వ రోజు కొత్త కెప్టెన్ గా సుధీర్ అవతరించారు. సుధీర్ కెప్టెన్ ఎలా అయ్యాడు ? హౌస్ లో జరిగిన టాస్క్ లు, హైలెట్స్ ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకోండి.

PREV
14
బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ తెలుగు 10 లో 33వ రోజు సుధీర్ కెప్టెన్సీ టాస్క్ లో విజయం సాధించి హౌస్ కి కొత్త కెప్టెన్ అయ్యారు. అనేక ట్విస్టుల నడుమ సుధీర్ కెప్టెన్సీ కంటెండర్ గా పోటీ చేసి విజయం సాధించారు. ముందుగా లీడర్ బోర్డులో బాటమ్ లో ఉన్న రెండు జంటలు షాలిని, రోహిత్.. ఝాన్సీ, ముకేశ్ లకు బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రెండు జంటల నుంచి ఒక్కొక్కరు డేంజర్ జోన్ లోకి వెళ్ళాలి అని .. మిగిలిన ఇద్దరూ ఒక పెయిర్ గా మారి గేమ్ కొనసాగించాలి అని బిగ్ బాస్ తెలిపారు.

24
షాలిని కోసం రోహిత్ త్యాగం

దీనితో రోహిత్.. షాలిని కోసం త్యాగం చేసి డేంజర్ జోన్ లోకి వెళ్ళాడు. ముఖేష్, ఝాన్సీ లలో ఝాన్సీ వాంటెండ్ గా డేంజర్ జోన్ లోకి వెళ్ళింది. డేంజర్ జోన్ లోకి వెళ్లినప్పటికీ ఝాన్సీ తన మ్యాజిక్ పవర్ ఉపయోగించుకోవాలి అని డిసైడ్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఫ్లిప్ చేయి ఫేస్ చేయి అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో నరేష్, రామ్ ప్రసాద్ విజయం సాధించారు.దీనితో వీరికి లీడర్ బోర్డులో పాయింట్స్ మరింతగా పెరిగి అగ్రస్థానంలో కొనసాగారు.

34
సేఫ్ జోన్ లో ఏడుగురు

అయినప్పటికీ బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు. రామ్ ప్రసాద్, నరేష్ లలో ఒకరు డేంజర్ జోన్ లోకి వెళ్ళాలి అని చెప్పారు. దీనితో నరేష్ తనకు డేంజర్ జోన్ లోకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. దీనితో హౌస్ లో వర్షిణి, అమన్, దేబ్జానీ, త్రిగుణ్, సుధీర్, రామ్ ప్రసాద్, వంశీ ఏడుగురు సేఫ్ జోన్ లో ఉన్నట్లు అయింది. ఈ ఏడుగురిలో ఐదుగురికి మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడే అవకాశం ఉంటుంది అని, ఇద్దరు తప్పుకోవాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ తెలిపారు. ఆడేది ఎవరు ? తప్పుకునేది ఎవరు ? అని నిర్ణయించుకుని చెప్పమని బిగ్ బాస్ తెలిపారు.

44
అమన్ కి చివరి నిమిషంలో మళ్ళీ దెబ్బ

వీళ్ళు ఏడుగురు ఓటింగ్ ద్వారా వర్షిణి, అమన్ లని తప్పించాలి అని నిర్ణయించారు. దీనికి వర్షిణి ఓకె చెప్పింది. కానీ తాను తప్పుకోవడానికి అమన్ అంగీకరించలేదు. దీనితో బిగ్ బాస్ ఇన్వాల్వ్ అయి ఓటింగే ఫైనల్ అని తేల్చేశారు. దీనితో అమన్ కూడా తప్పుకోక తప్పలేదు. మొత్తానికి త్రిగుణ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, సుధీర్, వంశీ కెప్టెన్సీ టాస్క్ ఆడే అవకాశం పొందారు. ఈ టాస్క్ లో సుధీర్ విజయం సాధించి హౌస్ కి కొత్త కెప్టెన్ అయ్యారు.

Read more Photos on
click me!

Recommended Stories