సీనియర్‌ ఎన్టీఆర్‌, జూ ఎన్టీఆర్‌లో ఉన్న కామన్‌ టేస్ట్ ఏంటో తెలుసా? నందమూరి హీరోల్లో ఎవరూ అలా చేయరు!

First Published | Oct 28, 2024, 6:29 PM IST

సీనియర్‌ ఎన్టీఆర్‌కి, జూ ఎన్టీఆర్‌కి మధ్య రూపం, నటన, డైలాగ్‌ డెలివరీ మాత్రమే కాదు, మరో విషయంలోనూ కామన్‌ క్వాలిటీ ఉంది. అది మరే ఇతర నందమూరి హీరోలకు లేకపోవడం విశేషం. 
 

నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వస్తున్నారు. ఎవరొచ్చినా, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావుని కొట్టేవాళ్లే లేరు. ఆయనొక లెజెండ్‌. తెలుగు సినిమా దశని మార్చేసిన నటుడి. తెలుగు సినిమాని, తెలుగు ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసిన నటుడు. పౌరానిక సినిమాలకు ఆయనకంటే బెస్ట్ ఎవరూ చేయలేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా కృష్ణుడు, రాముడు పాత్రలకు ఆయన బెస్ట్ ఆప్షన్‌. ఆయన కాకుండా ఎవరు వేసినా ఆ పాత్రలు అంతగా నిండుతనం రాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

NTR

ఎన్టీ రామారావు వారసత్వాన్ని అందుపుచ్చుకుని హరికృష్ణ, బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చారు. మిగిలిన కొడుకులు కూడా సినిమాలపై ఫోకస్‌ పెట్టారు కానీ, నటులు కాలేదు. బాలయ్య మాత్రమే హీరోగా నిలబడ్డాడు. స్టార్‌ హీరోగా ఎదిగాడు. హరికృష్ణ కొన్ని సినిమాలకే పరిమితమయ్యారు. కానీ ఆయన వారసులను సినిమాల్లోకి తీసుకొచ్చారు.

రెండో కొడుకు కళ్యాణ్‌ రామ్‌, చిన్న కొడుకు జూ ఎన్టీఆర్‌ని సినిమాల్లోకి తీసుకొచ్చారు. మూడో తరంలో నటుల్లో తారక్‌ టాప్‌లో ఉన్నారు. స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు `దేవర` చిత్రంతో పాన్‌ ఇండియా హీరోగా నిలబడ్డాడు. 
 


ఇప్పుడు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ తేజ హీరోగా పరిచయం కాబోతున్నారు. అలాగే జానకీ రామ్‌ కొడుకు ఎన్టీఆర్‌ (చిన్న) సైతం హీరోగా పరిచయం కాబోతున్నారు. చైతన్య కృష్ణ ఇప్పటికే హీరోగా రెండు మూడు సినిమాలు చేశారు. కానీ ఏ నందమూరి హీరోకి రాని సీనియర్‌ ఎన్టీఆర్‌కి సంబంధించిన టేస్ట్ జూ ఎన్టీఆర్‌కి మాత్రమే వచ్చింది. పెద్ద ఎన్టీఆర్‌ ఎలా చేస్తారో, తారక్‌ కూడా అలానే చేస్తాడు. అలాంటి ఫుడ్డే తింటాడట. సేమ్‌ టూ సేమ్‌ తాత స్టయిల్‌లోనే ఫుడ్‌ని ఇష్టపడతాడట.

అయితే అందులో ఒక స్పెషల్‌ ఉంది. అది మాత్రం అప్పుడు ఎన్టీ రామారావు, ఇప్పుడు తారక్‌ ఒకేలా తింటారట. బాలయ్య, ఏపీ సీఎం చంద్రబాబు ఆ విషయాన్ని తెలిపారు. నాటుకోడి మొత్తం ఉదయాన్నే తినేవారట ఎన్టీఆర్‌. ఆయనకు అనారోగ్య సమస్య అనేదే వచ్చేది కాదని తెలిపారు.

అయితే ఈ సందర్బంగానే బాలయ్య చెబుతూ, జ్వరం వస్తే నాటుకోడికి ఉప్పు కారం, మసాలా దట్టించి కాల్చిన చికెన్‌ మొత్తాన్ని తిని దుప్పటి కప్పుకుని పడుకుంటారు. మార్నింగ్‌ లేచేసరికి ఆ దుప్పటి మొత్తం తడిసిపో జ్వరం పరార్‌ అని చెప్పారు బాలయ్య. తనని కూడా అలా చేయాలంటే తన వల్ల కాదని చెప్పాడట. 
 

అయితే ఓ ఇంటర్వ్యూలో జూ ఎన్టీఆర్‌ సైతం ఇదే విషయాన్ని చెప్పారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణితో కలిసి చిట్‌ చాట్‌ చేస్తున్న సమయంలో ఆయన తనకిష్టమైన ఫుడ్‌ గురించి చెబుతూ, నాటుకోడికి మసాలా దట్టించి బాగా కాల్చిన తర్వాత అందులో కీమా దట్టించి ఒక చెపాతి పెట్టుకుని తింటుంటే ఉంటది చూడూ అంటే నోరూరించాడు తారక్‌.

అది విన్న కీరవాణి సైతం తనకు నోరూరిపోతుందని, నాన్‌ వెజ్‌ తినని తనకే అలాంటి ఫీలింగ్‌ కలుగుతుందని చెప్పడం విశేషం. ఇలా ఈ ఫుడ్‌ హ్యాబిట్‌ మాత్రం ఆ ఎన్టీఆర్‌, ఈ జూ ఎన్టీఆర్‌కి మాత్రమే ఉందని, మరెవ్వరూ అలా చేయరని తెలుస్తుంది. అందుకే తాతకి తగ్గ మనవడు అనిపించుకుంటున్నారు ఎన్టీఆర్‌. రూపం, నటన శైలిలోనే కాదు, టేస్ట్ ల్లోనూ వీరిద్దరివి కలవడం విశేషం. 

ఇక జూ ఎన్టీఆర్‌ ఇటీవలే `దేవర` సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఈ సినిమా సుమారు ఐదు వందల కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేయడం విశేషం. రాజమౌళితో సినిమా చేశాక నెక్ట్స్ మూవీ ఫ్లాప్‌ అవుతుందనే సెంటిమెంట్‌ ఉంది. దాన్ని బ్రేక్‌ చేశారు తారక్‌. ఇక ఇప్పుడు ఆయన ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. 

Read more: రాజీవ్‌ గాంధీని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? పేరెంట్స్ పెద్ద షాక్‌

also read: రంభ అసలు పేరేంటో తెలుసా? ఎలా మారిందంటే? పాపం చిన్న పిల్లని చేసి ఆడుకున్నారట

Latest Videos

click me!