బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, సీత, నాగ మణికంఠ, మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. వీరి ఎలిమినేషన్ అనంతరం 13 మంది హౌస్లో ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 8 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుండి మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. మరో ఏడుగురు హౌస్లో ఉన్నారు.
9వ వారానికి గాను యష్మి, టేస్టీ తేజ, హరితేజ, నయని పావని, పృథ్విరాజ్ నామినేట్ అయినట్లు సమాచారం. ఈ వారం నేరుగా నామినేట్ చేసే అధికారం మెగా చీఫ్ విష్ణుప్రియకు బిగ్ బాస్ ఇచ్చాడు. దాంతో ఆమె ఆ ఐదుగురిని నామినేట్ చేసి జైల్లోకి పంపిందట. వీరిలో ఒకరు వచ్చే వారం ఇంటిని వీడనున్నారు. మిగిలిన 12 మందిలో టాప్ ఫైవ్ ఎవరనే చర్చ కొనసాగుతుంది.