కావాలంటే నన్ను గిచ్చి చూసుకోండి.. అందం కోసం అలా చేయలేదు, ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై నయనతార

First Published | Oct 28, 2024, 6:00 PM IST

సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ నయనతార. 4 పదుల వయసు సమీపిస్తున్నప్పటికీ నయనతార క్రేజ్ తగ్గడం లేదు.  నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. 

Actress Nayanthara

సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ నయనతార. 4 పదుల వయసు సమీపిస్తున్నప్పటికీ నయనతార క్రేజ్ తగ్గడం లేదు.  నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది.  గత ఏడాది బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.  

నయనతార ఎప్పుడూ మీడియాకి దూరంగా ఉంటుంది. కనీసం సినిమా ఈవెంట్స్ కి కూడా ఆమె హాజరు కాదు. అలా చేసే ఏకైక హీరోయిన్ నయనతార మాత్రమే. కానీ ఆమె క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు తమ చిత్రాల్లోకి అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి స్వాగతం చెబుతుంటారు. తాజాగా నయనతార గురించి కొన్ని రూమర్స్ వైరల్ అయ్యాయి. 


తన వయసు తగ్గించుకుని అందంగా కనిపించేందుకు నయన్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నట్లు రూమర్స్ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. నయనతార ముఖం ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తుండడంతో  ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. దీనిపై నయనతార స్పందించింది. నేను ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు. ఎప్పుడూ ఒకే లుక్ లో కాకుండా డిఫెరెంట్ గా కనిపించడం నాకు ఇష్టం. ఒకసారి ఐబ్రోస్ డిజైన్ మార్చుతా. అందువల్ల అలా అనిపించి ఉండొచ్చు. 

nayanthara

ఫుడ్ డైట్ తరచుగా మార్చుతూ ఉంటా. కాబట్టి కొన్నిసార్లు బొద్దుగా కనిపిస్తా.. కొన్నిసార్లు బుగ్గలు లోపలకి పోయినట్లు అనిపిస్తాయి. నేనైతే ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోలేదు. కావాలంటే మీరు ఒకసారి గిచ్చి చూడండి అంటూ నయన్ ఫన్నీగా చెప్పింది. రూమర్స్ కి చెక్ పెట్టింది. 

Latest Videos

click me!