తండ్రి బాటలోనే అకీరా నందన్, సక్సెస్ కు దారి అర్దమైంది

Published : Nov 07, 2024, 09:20 AM IST

పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ ఎంట్రీ గురించి చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓజీ సినిమాలో అకీరా చిన్న పవన్ కల్యాణ్ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

PREV
15
 తండ్రి బాటలోనే అకీరా నందన్, సక్సెస్ కు దారి అర్దమైంది
Akira Nandan, Pawan Kalyan, renu desai


పవర్‌ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ త‌న‌యుడు అకీరా నంద‌న్ సినిమాల్లోకి రాకముందే అతడికి విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలసిందే. అంతెందుకు  అకీరా బ‌ర్త్ డే రోజున మెగా ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుతున్నారు.  

అయితే అకీరా తెలుగు సినీ పరిశ్రమ ఎంట్రీ కొంతకాలంగా ఆసక్తిగా మారింది. ఇప్పటికే మారాఠిలో ఓ చిత్రం చేసిన అకీరా వెంటనే తెలుగులో ఓ మూవీ చేయబోతున్నాడని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే అకీరా సినిమా, తెలుగు వెండితెర ఎంట్రీపై ఇప్పటికీ క్లారిటీ లేదు.

25
Akira Nandan, Pawan Kalyan, renu desai


 అందుతున్న సమాచారం మేరకు ఓజీ లోకి పవన్ కొడుకు అకీరానందన్ కూడా కనపడనున్నారు. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ ఓజీతో ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎం అయిన దగ్గరనుంచి పవన్ తో పాటు కొన్ని ఈవెంట్స్ లో కనిపించిన అకీరా ఇప్పుడు ఏకంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు టాక్. అది కూడా పవన్ కళ్యాణ్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ ఓజీలో అనగానే ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి క్యారెక్టర్ లో అకీరా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

35
Pawan Kalyan and Akira Nandan

 ఈ నేపధ్యంలో మరో విషయం బయిటకు వచ్చింది. అకీరాను తండ్రి పవన్ కళ్యాణ్ ...ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ లో చేర్పించారట. తనకు యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చిన వైజాగ్ సత్యానంద్ గారి ఇనిస్టిట్యూట్ లో అకీరాను చేర్పించారని తెలుస్తోంది.

ప్రభాస్ వంటి స్టార్స్ సైతం అక్కడే యాక్టింగ్ కోర్స్ చేసారు. ఓ రకంగా తెలుగులో నిలదొక్కుకుందామనుకునే స్టార్స్ కు ఈ ఇనిస్టిట్యూట్ బాగా కలిసి వస్తోంది. సత్యానంద్ గారి దగ్గర పూర్తి నటనలో శిక్షణ తీసుకున్న అకీరా మరిన్ని మొళుకవలు ముంబైలో నేర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏదైమైనా మంచి నటనతో తెరపై ఎంట్రీ ఇస్తే అతి తక్కువ కాలంలోనే తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవచ్చు అనేది నిజం. 

45
Pawan Kalyan


ఇప్పటికే సినిమాలకు సంబంధించిన కోర్స్ చేస్తున్న అకీరా ఓజీ తో ఎంట్రీ ఇస్తున్నాడన్న న్యూస్ తో సోషల్ మీడియాలో సందడి స్టార్ట్ అయ్యింది.

అలాగే కొన్ని రోజుల క్రితం అకిరా కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. OG సినిమా కోసం పవన్ కూడా మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ పట్టుకున్నారు. దీంతో నిజంగానే అకిరా ఈ సినిమాలో కనిపిస్తాడని భావిస్తున్నారు ఫ్యాన్స్.

55


అయితే అఫీషియల్ గా మాత్రం  అకిరా నందన్ డెబ్యూ మీద ఇంత వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. టీం నుంచి కూడా ఎలాంటి లీక్స్ ఇవ్వటం లేదు. పవన్ కళ్యాణ్ కొడుకు సినిమా అంటే ఖచ్చితంగా ఓ రేంజిలో క్రేజ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట.

సుజీత్ వంటి యంగ్ డైరక్టర్ చేతిలో తన కొడుకుని పెట్టాలని పవన్ భావిస్తున్నారట. ఈ మేరకు కొందరు దర్శకులు,నిర్మాతలు పవన్ ని గతంలో స్క్రిప్టులతో కలిసారని వినికిడి. అయితే ఇంకా టైమ్ ఉందని పవన్ సున్నింతగా ఆ ప్రపోజల్స్ ప్రక్కన  పెట్టేసారని తెలుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories