మంచి ప్రొడక్షన్ వాల్యూస్, డీసెంట్ గా అనిపించే బిజియం.. స్పై గా నిఖిల్ అందించిన పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో ప్రధాన హైలైట్ అని చెప్పొచ్చు. దర్శకుడి వైపు నుంచి బలమైన ఎఫోర్ట్ కనిపించకపోవడంతో స్పై మూవీ రెగ్యులర్ గూఢచారి కథగా యావరేజ్ గా అనిపిస్తుంది. సుభాష్ చంద్రబోస్ అంశంపై ఉన్న ఆసక్తిని ఉపయోగించుకుని బలమైన చిత్రంగా తీర్చిదిద్ది ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది. మరి ఈ యావరేజ్ ట్రీట్మెంట్ తో బాక్సాఫీస్ వద్ద స్పై ఎలాంటి ప్రభావం చూపుతాడో చూడాలి.