తెలుగు సినీపరిశ్రమలో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి నవ్వులు పూయించిన ఫిష్ వెంకట్ జీవితంలో మాత్రం చాలా విషాదాలు ఉన్నాయి. ఆయన 100 సినిమాలకుపైగా చేసినా కానీ ఆర్ధికంగా నిలబడలేకపోయాడు. ముషీరాబాద్ ప్రాంతంలో చేపల వ్యాపారం చేయడం వల్ల అతనికి ఫిష్ వెంకట్ అనే పేరు వచ్చింది.
అయితే దివంగత నటుడు శ్రీహరి ప్రోత్సాహంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఫిష్ వెంకట్.. కొన్ని సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా, కొన్ని సినిమాల్లో ఫుల్ లెన్త్ రోస్ కూడా చేశాడు. కొన్ని సినిమాల్లో మాత్రం ఆయన పాత్ర పరిధి చాలా తక్కువ అవ్వడంతో భారీ స్థాయిలో రెమ్యునరేషన్ వచ్చేది కాదు. దానికితోడు వెంకట్ అలవాట్లు కూడా అతని ఆరోగ్యాన్ని పాడుచేసినట్టు తెలుస్తోంది.