Comedian Ali: రాజకీయాలపై కమెడియన్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను గతంలో కొన్ని పార్టీలకు గొడ్డు చాకిరీ చేశానని, అయినప్పటికీ ప్రతిఫలం శూన్యం అని అలీ అన్నారు.
టాలీవుడ్ నటుడు, కమెడియన్ అలీ గురించి పరిచయం అవసరం లేదు. బ్రహ్మానందం స్థాయిలో స్టార్ కమెడియన్ గా అలీ చాలా కాలం రాణించారు. చిన్ననాటి నుంచే అలీ నటుడిగా కెరీర్ ప్రారంభించారు. కమెడియన్ గా నటిస్తూనే హీరోగా కూడా అలీ సక్సెస్ లు సాధించడం విశేషం. ఇప్పుడు కాస్త హవా తగ్గింది కానీ గతంలో టాలీవుడ్ లో అలీ హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే కమెడియన్స్ లో ఒకరు. అలీకి రాజకీయాలతో కూడా టచ్ ఉంది.
25
వైసీపీలో కీలక బాధ్యతలు
గత వైసీపీ ప్రభుత్వంలో అలీ కీలక నేతగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అలీకి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైసర్ గా పదవి కూడా లభించింది. కానీ తన కల మాత్రం నెరవేరలేదు. ఎంపీగానో, ఎమ్మెల్యే గానో పోటీ చేయాలనేది అలీ కల. అది ఇంత వరకు నెరవేరలేదు. తాజాగా ఇంటర్వ్యూలో అలీ రాజకీయాలపై నిరాశని, విరక్తిని వ్యక్తం చేశారు. రాకీయాల వల్ల తనకు ఒరిగింది ఏమీ లేదు అని అలీ అన్నారు.
35
20 ఏళ్ళు ఆ పార్టీలోనే
తాజాగా ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. కానీ అనుకోని పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్లి ఒక పార్టీ కండువా కప్పారు. అది 1999 లో అని అలీ తెలిపారు. అలీ చెప్పింది తెలుగుదేశం పార్టీ గురించే. అలీ రాజకీయ ప్రస్థానం మొదలైంది తెలుగు దేశం పార్టీతోనే. ఆ పార్టీలో 20 ఏళ్ళ పాటు కొనసాగినట్లు అలీ తెలిపారు.
నేను ఆ పార్టీ నుంచి ఏమీ ఆశించలేదు. కానీ నా కష్టాన్ని గుర్తించాలని మాత్రం కోరుకున్నా. అలా కాకుండా 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలకు మాత్రం నన్ను వాడుకుని, గొడ్డు చాకిరీ చేయించి వదిలేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది ? నన్ను కూరలో కరివేపాకు తీసినట్లు తీసి పక్కన పెట్టేశారు. నా సినిమాలు మానుకుని ఆ పార్టీ కోసం ప్రచారం చేశాను. 20 ఏళ్ళ పార్టీ అన్నీ భరిస్తూ ఆ పార్టీలోనే ఉన్నా. ఇక వద్దనుకుని మరో పార్టీ వైసీపీలో చేరినట్లు అలీ తెలిపారు.
55
అందుకే రాజకీయాలకు గుడ్ బై
అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఇక రాజకీయాలు అవసరం లేదు అని అనిపించింది. అందుకే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లు అలీ తెలిపారు. నాకు అన్నం పెట్టింది సినిమా, రాజకీయం కాదు. అలాంటి సినిమాని వదులుకుని రాజకీయ పార్టీలకు ఎందుకు సేవ చేయాలి ? అందుకే రాజకీయాలు పక్కన పెట్టేసినట్లు అలీ ఆవేదన వ్యక్తం చేశారు.