బాలనటుడిగా అనేక తమిళ చిత్రాల్లో నటించిన శింబు, అప్పటికే తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. ఆ తర్వాత యువ నటుడిగా పరిచయమై, లవ్ స్టోరీ, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వంటి అన్ని రకాల చిత్రాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'మన్మధన్', 'వల్లవన్' వంటి చిత్రాలతో యువతలో మంచి ఆదరణ పొందారు. మధ్యలో వరుస పరాజయాలతో వెనుకడుగు వేసినా, 'మానాడు' వంటి విజయవంతమైన చిత్రాలతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. కేవలం నటుడిగానే కాకుండా, సింబు మంచి గాయకుడు కూడా. తాను నటించని చిత్రాలకు కూడా గాత్రదానం చేసి సంగీత ప్రియులను అలరించారు.