Youtube anvesh fire on prakash raj
బెట్టింగ్ యాప్ అంశాన్ని తెలంగాణ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రంగంలోకి దిగడంతో విచారణ వేగవంతమైంది. యాప్ నిర్వహకులే టార్గెట్‌గా కేసులో కొత్త సెక్షన్లు నమోదు చేశారు. ఇప్పటివరకు 19 మంది నిర్వహకులపై కేసులు నమోదు చేశారు. వీరిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ లాంటి అగ్ర తారలు ఇందులో ఉండడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
anvesh
ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్‌పై మొదటి నుంచి ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ యుద్ధం చేస్తున్నాడు. నిజానికి బెట్టింగ్ యాప్స్ అంశం ఇంతలా హైలెట్ కావడానికి కూడా అన్వేష్ ఒక కారణమని చెప్పొచ్చు. సజ్జనార్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూ తర్వాతే విచారణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను పోలీసులు విచారించారు. కాగా తాజాగా ప్రకాశ్ రాజ్‌ను టార్గెట్ చేస్తూ అన్వేష్ కీలక ప్రశ్నలు సంధించాడు.
తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రశ్నల వర్షం కురిపించాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అందరిలో ప్రకాశ్ దొంగ అంటూ విమర్శలు గుప్పించాడు. తనకు తాను గొప్ప దేశ భక్తుడని చెప్పుకునే ప్రకాశ్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ఏంటంటూ విమర్శించాబు. ప్రజలను ఉద్దరించడానికే ప్రకాశ్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశాడంటూ సెటైర్లు వేశాడు.
యాప్స్ ప్రమోషన్ చేసినందుకు ప్రకాశ్ రాజ్‌కు డబ్బులు వస్తాయని కానీ వీటివల్ల నష్టపోయిన వారి నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారంటూ ప్రశ్నించాడు. బెట్టింగ్ యాప్స్‌లో నష్ట పోయిన వారికి ప్రకాశ్ రాజ్ ఇవ్వాలని అన్వేష్ డిమాండ్ చేశాడు. ఈ విషయంలో అన్వేష్‌కు నెటిజన్లు సైతం సపోర్ట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే వారిని నుంచి డబ్బులు వసూలు చేయడమే సరైన శిక్ష అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.
హైకోర్టును ఆశ్రయించిన విష్ణు ప్రియ
కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో నిందితురాలిగా ఉన్న విష్ణుప్రియ తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. తనపై నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా చూడాలని, ఒకే కేసులో తనపై రెండు కేసులు ఎలా నమోదు చేస్తారంటూ పిటిషన్‌లో పేర్కొంది. మరి దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.