తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడు. అసెంబ్లీ సాక్షిగా ఆయన తాను సీఎంగా ఉన్నంత కాలం బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ రేట్లు పెరగవని ప్రకటించారు. కానీ ప్రకటించి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే మాట తప్పాడు. అసెంబ్లీలో తాను ప్రకటించిన మాటనే ఆయన ఫాలో కాలేదు.
ఆయనే కాదు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా అసెంబ్లీలోనే బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్లు పెంచము అన్నారు. తాజాగా తెలంగాణలో `గేమ్ ఛేంజర్` సినిమాకి టికెట్ రేట్లు పెంచుతూ బుధవారం జీవో జారీ చేశారు.
తెలంగాణ `గేమ్ ఛేంజర్` సినిమాకి టికెట్ రేట్లని పెంచారు. అదే సమయంలో ఆరు షోలకు పర్మీషన్ ఇచ్చారు. సాధారణంగా నాలుగు, ఐదు షోస్ ఉంటాయి. కానీ ఆరుషోలకు కూడా అనుమతి ఇచ్చారు. ఉదయం నాలుగు గంటల షోకి కూడా అనుమతినిచ్చింది. అదే సమయంలో టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసింది.
మల్టీప్లెక్సుల్లో రూ.150, సింగిల్ థియేటర్లలో వంద రూపాయలు పెంచుతూ జీవో విడుదల చేసింది. అయితే ఇది కేవలం ఒక్క రోజు మాత్రమే. రిలీజ్ డే రోజే ఈ రేట్లు ఉంటాయి. `గేమ్ ఛేంజర్` సినిమా జనవరి 10న విడుదల అవుతున్న విషయం తెలిసిందే.
ఇక జనవరి 11 నుంచి కూడా టికెట్ రేట్లు పెంచింది. మల్టీఫ్లెక్సుల్లో 100 రూపాయలు, సింగిల్ థియేటర్లలో యాభై రూపాయలు పెంచుతూ జీవోలో పేర్కొంది. జనవరి 19 వరకు ఈ రేట్లు అందుబాటులో ఉంటాయి. పెరిగిన రేట్లతో మల్టీప్లెక్సుల్లో ఒక టికెట్ ధర రూ.400, సింగిల్ థియేటర్లలో రూ.250 ఉంటుంది.
తెలంగాణ సీఎం అసెంబ్లీలో టికెట్ రేట్లు పెంచము అని ఇప్పుడు పెంచడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో కామెంట్లు స్టార్ట్ అయ్యాయి. ఇది కొత్త వివాదానికి దారితీయబోతుందని తెలుస్తుంది.
అయితే నిర్మాత దిల్ రాజు ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సుమారు రూ..450కోట్ల బడ్జెట్ పెట్టి `గేమ్ ఛేంజర్` సినిమాని నిర్మించారు. బిజినెస్ కూడా భారీగానే అయ్యింది.
ఇలాంటి టైమ్‌లో టికెట్ రేట్లు పెంచకపోతే రికవరీ కష్టమని, నష్టపోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు దిల్ రాజు. ఆయన ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దిల్‌రాజు తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.
read more: `గేమ్ ఛేంజర్`కి లైన్ క్లీయర్.. `పుష్ప 2` టీమ్ వెనక్కి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న దిల్ రాజు
ఇక `గేమ్ ఛేంజర్` మూవీకి ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచింది. అలాగే మార్నింగ్ 1గంట షోకి కూడా పర్మీషన్ ఇచ్చింది. 1గంట షోకి ఆరువందలు పెంచింది. అదే సమయంలో ఆరు షోలకు అనుమతి ఇచ్చింది.
ఆ తర్వాత మల్టీఫ్లెక్సుల్లో రూ.175, సింగిల్ థియేటర్లలో రూ.135రూపాయలు పెంచుతూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 11 నుంచి 23 వరకు ఈ రేట్లు అమలులో ఉంటాయి. ఇలా మల్టీప్లెక్సుల్లో రూ.352, సింగిల్ థియేటర్లలో రూ.282 టికెట్ రేట్లు ఉండబోతున్నాయి. `పుష్ప2`తో పోల్చితే ఇవి చాలా తక్కువ అనే చెప్పాలి.
also read: 'గేమ్ ఛేంజర్' కాపీనా? స్టార్ హీరో సినిమా కథే, రిలీజ్ కి ముందు మరో వివాదం