సూపర్ స్టార్ కృష్ణ నటించిన సంచలన చిత్రం సింహాసనం మూవీ విషయంలో ఒక సంఘటన జరిగింది. ఈ చిత్రంలో శ్రీదేవి హీరోయిన్ గా నటించాల్సింది. కానీ ఆమె ఎందుకు నటించలేదో ఈ కథనంలో తెలుసుకోండి.
సూపర్ స్టార్ కృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో సింహాసనం ఒకటి. కృష్ణ తన సొంత ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించి నటించారు. ఈ మూవీలో రాధా, జయప్రద లాంటి హీరోయిన్లు నటించారు. సూపర్ స్టార్ కృష్ణ తో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్లు అంటే శ్రీదేవి, జయప్రద పేర్లే చెప్పాలి.
25
హీరోయిన్ గా జయప్రద
సింహాసనం చిత్రంలో కూడా శ్రీదేవి నటించాల్సింది. కానీ ఓ సంఘటన వల్ల అది జరగలేదు. ఈ మూవీలో మొదటి హీరోయిన్ గా అలకనందాదేవి పాత్రలో జయప్రదని కృష్ణ ఎంపిక చేశారు. జయప్రదకు మొదటి హీరోయిన్ గా మాట ఇచ్చేశారు. సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించారు.
35
కండిషన్ పెట్టిన శ్రీదేవి
శ్రీదేవి ఎప్పుడూ సూపర్ స్టార్ కృష్ణతో నటించడానికి రెడీగా ఉంటుంది. కానీ జయప్రద ఫస్ట్ హీరోయిన్ గా, తాను సెకండ్ హీరోయిన్ నటించేందుకు శ్రీదేవి అంగీకరించలేదట. అలకనంద పాత్ర తనకు ఇస్తే నటిస్తానని శ్రీదేవి కృష్ణకి చెప్పారట.
ఒకసారి మాట ఇస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కృష్ణ వెనక్కి తగ్గరు. అలకనంద పాత్ర జయప్రదకి ఫిక్స్ అయిపోయింది. ఆమెకి మాట ఇచ్చేశా అని కృష్ణ అన్నారట. సెకండ్ హీరోయిన్ గా నటిస్తే నటించు లేదా వెళ్ళిపో అని శ్రీదేవికి చెప్పారట. ఆ విధంగా శ్రీదేవి సింహాసనం చిత్రం నుంచి తప్పుకుంది.
55
కృష్ణ దర్శకత్వంలో..
శ్రీదేవి స్థానంలో రాధని తీసుకున్నారు. మొత్తంగా 1986లో సొంత నిర్మాణంలో, కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సింహాసనం మూవీ మంచి విజయం సాధించింది. కృష్ణ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.