Mind Bending Thriller: మారువేషంలో ఒక పర్వత గ్రామానికి వెళ్లిన పోలీసులకు అక్కడ ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. వింత సంఘటనల మధ్య వాళ్లు అక్కడే చిక్కుకుపోతారు. ఈ థ్రిల్లింగ్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఎక్కడ చూడొచ్చంటే?
2021లో విడుదలైనప్పటికీ, 'చురులి' ఓటీటీ ప్రేక్షకుల్లో ఇప్పటికీ హాట్ టాపిక్‌గా ఉంది. సాధారణ కథ అనుకుని సినిమా చూడటం మొదలుపెడితే, ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ప్రతి కొన్ని నిమిషాలకు కథ మలుపు తిరుగుతుండటంతో, తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. సినిమా చూశాక కూడా క్లైమాక్స్ గురించి ప్రేక్షకులు రకరకాల కోణాల్లో చర్చిస్తూనే ఉంటారు.
25
కేవలం 19 రోజుల్లోనే షూటింగ్!
'చురులి' సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మొత్తం సినిమాను కేవలం 19 రోజుల్లోనే చిత్రీకరించారట. సినిమాలోని చాలా సన్నివేశాలను దట్టమైన అటవీ ప్రాంతంలోనే తీశారు. కరోనా కంటే ముందే ఈ షూటింగ్ జరగడంతో, ఆ సహజమైన వాతావరణం సినిమాలోని థ్రిల్, మిస్టరీని మరింత పెంచింది. అడవి, అక్కడి ప్రజల వింత జీవనశైలి కథలో కీలక పాత్ర పోషిస్తాయి.
35
పోలీసులను చుట్టుముట్టిన మిస్టరీ
ఒక నేరస్థుడిని పట్టుకోవడానికి కొంతమంది పోలీసులు మారువేషంలో ఒక మారుమూల అటవీ గ్రామానికి వెళ్తారు. కానీ ఆ గ్రామం, అక్కడి ప్రజలు వాళ్లు ఊహించిన దానికంటే చాలా భిన్నంగా ఉంటారు. వాళ్ల వింత అలవాట్లు, ప్రవర్తన పోలీసులకు భయాన్ని కలిగిస్తాయి. ఆ గ్రామంలోకి వెళ్లాక, అక్కడి నుంచి బయటపడటం అంత సులభం కాదని వాళ్లు గ్రహిస్తారు. అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది.
ఒక స్వామీజీ, ఒక దెయ్యం, ఒక మిస్టరీ బంతి చుట్టూ కథ తిరుగుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యాయనేదే సినిమాలోని అసలు టర్నింగ్ పాయింట్. కథ ఎటు వెళ్తుందో ప్రేక్షకులు ఊహించలేని విధంగా స్క్రీన్‌ప్లే ఉంటుంది. అందుకే సినిమా అంతా ఉత్కంఠగా సాగుతుంది.
55
ఏ ఓటీటీలో చూడొచ్చు?
వినయ్ ఫోర్ట్, జోజు జార్జ్, సజిన్ గోపు, జాఫర్ ఇడుక్కి ప్రధాన పాత్రల్లో నటించిన 'చురులి' సినిమాను సోనీ లివ్ (Sony LIV) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించారు. సాధారణ థ్రిల్లర్ సినిమాల్లా కాకుండా, మిస్టరీ, అతీంద్రియ శక్తులు, ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ఒక డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది.