Vikram Fitness: 60 ఏళ్ల కుర్రాడు, యంగ్ హీరోలను మించిన ఫిట్‌నెస్.. విక్రమ్ సీక్రెట్ ఇదే

Published : Jun 20, 2026, 11:24 PM IST

 స్టార్ హీరో చియాన్ విక్రమ్  60వ పుట్టినరోజు జరుపుకున్నారు. కానీ ఆయన లుక్, ఫిట్‌నెస్, స్టైల్ చూస్తే కాలేజీ కుర్రాడిలా కనిపిస్తారు. ఇంతకీ అరవై ఏళ్ల వయసులోనూ విక్రమ్ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణమేంటి? ఆయన ఫిట్‌నెస్ రహస్యం ఏంటో తెలుసా? 

PREV
16
కుర్రాడిలా మెరిసిపోతున్న విక్రమ్..

సౌత్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కు 60 ఏళ్లు నిండాయి. . కానీ ఆయన ఫిట్‌నెస్, స్టైల్, లుక్ చూస్తే.. ఆయన వయసు 60 ఏళ్లంటే ఎవరూ నమ్మలేరు.ఇంతలా ఫిట్ నెస్ ను ఆయన ఎలా మెయింటేన్ చేస్తున్నాడు.

26
60 సినిమాల హీరో
విక్రమ్ 1990లో వచ్చిన 'ఎన్ కాదల్ కణ్మణి' సినిమాతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టారు. గతేడాది వచ్చిన 'వీర ధీర శూరన్' వరకు దాదాపు 60 సినిమాల్లో హీరోగా నటించారు. ప్రస్తుతం ఆయన చేతిలో మరో మూడు సినిమాలున్నాయి. ఈ వయసులోనూ యాక్షన్ సీన్లు చేస్తూ ఇంత ఫిట్‌గా ఎలా ఉన్నారని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
36
మిస్టర్ పర్ఫెక్ట్ విక్రమ్
విక్రమ్ ఫిట్‌నెస్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఆయన ఎప్పుడూ మంచి ఫిజిక్‌తో ఉంటారు. ప్రతి సినిమాలోని పాత్రకు తగ్గట్టుగా బరువు పెరగడం, తగ్గడం చేస్తుంటారు. అందుకే ఆయన్ని మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటారు. సోషల్ మీడియాలో విక్రమ్ ఫొటోలు చూసి అమ్మాయిలు ఫిదా అవుతుంటారు.
46
పాత్రకు తగ్గట్టు వర్కౌట్
విక్రమ్ ఎప్పుడూ ఒకేరకమైన వర్కౌట్ చేయరు. తన పాత్రకు అనుగుణంగా వర్కౌట్ ప్లాన్‌ను మార్చుకుంటారు. ముఖ్యంగా ఆయనకు ప్లైయోమెట్రిక్ వర్కౌట్స్ అంటే ఇష్టం. ఈ వర్కౌట్ శరీర బలాన్ని పెంచుతుంది. పాత్ర డిమాండ్‌ను బట్టి హెవీ వెయిట్స్, జిమ్ చేస్తూ సరైన ఆహారం తీసుకుంటారు.
56
ఎలాంటి ఆహారం తీసుకుంటారు?
ఫిట్‌నెస్ కేవలం వ్యాయామంపైనే కాకుండా, తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందని విక్రమ్ నమ్ముతారు. బరువు తగ్గడానికి ఆయన ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తింటారు. కార్బోహైడ్రేట్లు తగ్గించి, గుడ్డులోని తెల్లసొన, చేపలు, చికెన్ వంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటారు. అందుకే ఆయన అంత ఫిట్‌గా ఉంటారు.
66
మరణం అంచులదాకా వెళ్లి బతికిన హీరో

విక్రమ్ డెడికేషన్ వెనుక ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉంది. కాలేజీ రోజుల్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. డాక్టర్లు ఇక నడవలేరని చెప్పారు. కానీ, విక్రమ్ పట్టుదలతో, కఠోర శ్రమతో మళ్లీ నడవడమే కాదు, ఈ రోజు సూపర్ స్టార్‌గా నిలిచారు.

Read more Photos on
click me!

Recommended Stories