Brahmamudi: రాజ్, అపర్ణ లను క్షమాపణ చెప్పమన్న చిట్టి.. అసూయతో రగిలిపోతున్న స్వప్న!

Published : Mar 31, 2023, 01:10 PM IST

Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. తన ప్రమేయం లేకుండానే అత్తగారింట్లో అడుగు పెట్టి అక్కడ సమస్యలని ఎదుర్కొంటున్న ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్.ఇక ఈరోజు మార్చి 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
17
Brahmamudi: రాజ్, అపర్ణ లను క్షమాపణ చెప్పమన్న చిట్టి.. అసూయతో రగిలిపోతున్న స్వప్న!

ఎపిసోడ్ ప్రారంభంలో మనసులో మాట్లాడుకుంటే నాకు ఎలా తెలుస్తుంది నన్ను తిట్టుకున్నది చాలు విషయం ఏంటో చెప్పండి అంటుంది కావ్య. నా మనసులో మాటలు నీకు ఎలా వినబడ్డాయి అంటాడు రాజ్. మీ మనసులో ఉన్న ప్రశ్నలని నేను ఊహించగలను అంటుంది కావ్య. రాత్రి గదిలో ఏమీ జరగలేదు కదా అంటాడు రాజ్. ఎందుకు జరగలేదు మొత్తం జరిగిపోయింది అంటుంది కావ్య. కంగారుపడిన రాజ్ దయచేసి నిజం చెప్పు అంటాడు. సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్న కావ్యని చూసి చిరాకు పడతాడు రాజ్ నిజం చెప్పమంటూ మళ్లీ రిక్వెస్ట్ చేస్తాడు. దాని గురించి తెలుసుకోవాలని అంత కుతూహలంగా ఉందా అంటుంది కావ్య. గాడిద గుడ్డు ఉంది నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను ఏమి జరగలేదని అందరికీ చెప్పి నా శీలం మీద పడిన మచ్చని చెరిపేసుకుంటాను అంటాడు రాజ్.

27

అసలు విషయం చెప్పకుండా సంబంధం లేని మాటలు మాట్లాడుతుంది కావ్య. మీ పెద్దమ్మ లాగా ఏవేవో మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేయొద్దు నిజం చెప్పు అంటాడు రాజ్. ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను ఒక వారం రోజుల తర్వాత కనబడండి అంతా గుర్తు తెచ్చుకొని చెప్తాను అంటుంది కావ్య. ఈ పొగరే వద్దనేది అంటాడు రాజ్. మీరు ఇంత బిరుదు ఇచ్చారు కాబట్టి మీరు నన్ను రిక్వెస్ట్ చేస్తేనే చెప్తాను అంటుంది కావ్య. అది ఈ జన్మలో జరగదు అంటాడు రాజ్. అయితే చెప్పడం కూడా జన్మలో జరగదు అంటుంది కావ్య. ఇంతలోనే అక్కడికి వచ్చిన కళ్యాణ్ నా కొత్త కవిత విను అంటూ కవిత్వాన్ని వినిపిస్తాడు. ఒరేయ్ ఈ కవిత్వం కన్నా వీళ్ళ అమ్మ మాట్లాడే బట్లర్ ఇంగ్లీష్ చాలా నయం, నన్ను వదిలేసి ఈ కళావతిని విసిగించు, తన చెవిలోంచి రక్తం వచ్చేలాగా కవిత్వం వినిపించు అప్పటికి గాని నా కసి తీరదు అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్.

37

శ్రీకృష్ణుని భలే తయారు చేశారు అంటాడు కళ్యాణ్. ఈయన చెప్పేది సరిగ్గా అర్థం చేసుకుంటే జ్ఞాన దీపాన్ని దర్శించవచ్చు తరించొచ్చు అంటుంది కావ్య. మరోవైపు  కోపంగా ఉన్నా తనని పట్టించుకోవటం లేదని రాహుల్ మీద అరుస్తుంది స్వప్న. ఇప్పుడు నేనేం చేసేది అంటాడు రాహుల్. అమ్మని కలవాలి ఏర్పాటు చేయు అంటుంది స్వప్న. మినిస్టర్ పర్యటనకి ఏర్పాటులు చేయమన్నట్లుగా చెప్తున్నావు అంటాడు రాహుల్. నేను ఏం చెప్పినా చేయటం లేదు కదా అంటుంది స్వప్న. అయినా ఇప్పుడు ఎందుకు తనని కలవడం అని రాహుల్ అంటే మా అమ్మ దగ్గర కూడా మా చెల్లి నన్ను బ్యాడ్ చేసి ఉంటుంది అందుకే అమ్మ దగ్గరికి వెళ్లి  ఏం జరిగిందో తెలుసుకోవాలి. నా దారికి అడ్డు వస్తే మాత్రం కావ్యకి గట్టిగా బుద్ధి చెప్తాను అంటుంది స్వప్న. అసలు మా అమ్మ నా మీద కోపంతో ఉందో బెంగతో ఉందో తెలుసుకుంటాను అంటూ గొంతుక మార్చి బ్యాంకు వాళ్లు మాట్లాడుతున్నట్లుగా కనకంతో మాట్లాడుతుంది స్వప్న.

47

ముందు చెడామడా తిట్టేసిన కనకం పాతిక లక్షలు లోన్ ఇస్తాను అనేసరికి సాఫ్ట్ గా మాట్లాడుతుంది. ఇప్పుడు గుడికి వెళుతున్నాను ఇంటి దగ్గర లేను సాయంత్రం ఫోన్ చెయ్యు మా ఇంటి అడ్రస్ చెప్తాను అంటుంది కనకం. సరే అంటూ ఫోన్ పెట్టేసిన స్వప్న మా అమ్మ ఎక్కడ ఉందో తెలిసిపోయింది అంటూ ఆనందంగా చెప్తుంది. కానీ నువ్వు వెళితే నేను కూడా దొరుకుపోతాను అంటాడు రాహుల్.అలా దొరక్కుండా నా దగ్గర ఐడియా ఉంది అంటుంది స్వప్న. మరోవైపు మొదటి రాత్రి పూర్తయింది మన ఆచారం ప్రకారం గుడికి తీసుకెళ్లి ముడుపు కట్టించి అమ్మవారికి చేయించాలి అంటాడు సీతారామయ్య. కుదరదు, ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇప్పటికే అనుభవిస్తున్నాను అంటాడు రాజ్. వారితో కలిసి గుడికి వెళ్ళవా అంటుంది చిట్టి. ఎందుకు బలవంత పెడతారు అంటుంది  అపర్ణ.

57

ఇది ఇంటి ఆచారం ఈ ఆచారాన్ని నువ్వు మధ్యలో ఆపేస్తావా అంటుంది చిట్టి. అంటే నా అభిప్రాయానికి విలువ లేదా అంటాడు రాజ్. ఇప్పటికే బలవంతం చేసి పెళ్లి చేశారు ఇంకా ఎందుకు వాడిని బలవంతం చేస్తారు అంటుంది అపర్ణ. ఏం మాట్లాడుతున్నావు నీ అయిష్టాన్ని వాడికి అంటించుకు నా భర్తకే ఎదురు సమాధానం చెప్తావా, మీ మామగారి ముందు నిలబడి నీ నిర్ణయాలు అమలు చేసే అంత పెద్ద దానివి అయిపోయావా.ఇప్పటికిప్పుడు మీ తల్లి కొడుకులిద్దరూ నా భర్తకి క్షమాపణ చెప్పండి కోపంతో పగిలిపోతుంది చిట్టి. వెంటనే రాజ్ సారీ చెప్పి మమ్మీ తరఫున కూడా నేను సారీ చెప్తున్నాను అంటాడు. ఏం మీ మమ్మీ పైనుంచి దిగి వచ్చిందా, క్షమాపణ చెప్పటానికి నామోషియా అంటుంది చిట్టి. మీకు మావయ్య గారికి ఎదురు సమాధానం చెప్పే ధైర్యం ఇంట్లో ఎవరికీ లేదు.

67

రాజ్ మీద ఉన్న అపేక్షతో నేను మీతో మాట్లాడుతున్నాను అన్న సంగతి మర్చిపోయాను దయచేసి క్షమించండి అంటుంది అపర్ణ. రెడీ అయి రండి గుడికి వెళ్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు సీతారామయ్య దంపతులు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నీ కసి చల్లారిందా, నా కొడుక్కి లేనిపోని తిప్పలు తెచ్చి పెట్టావు ఏదో ఒక రోజు నీ కొడుకు వల్ల నువ్వు అవమానాలు పాలవుతావు గుర్తుపెట్టుకో అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ.అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు గుడికి రావడం ఇష్టం లేదు అని కావ్య తో చెప్తాడు రాజ్. మీకు దేవుడు అంటే ఇష్టం లేదా అని కావ్య అంటే కాదు ఈ దయమంటే ఇష్టం లేదు కావ్యని చూసి చెప్తాడు రాజ్. నాకు మాత్రం మీతో రావడం ఇష్టం అనుకున్నారా,  ప్రతిసారి అవమానిస్తుంటే మిమ్మల్ని చూసినప్పుడల్లా ఒంటి మీద తేళ్లు పాకినట్లుగా అనిపిస్తుంది అంటుంది కావ్య.

77

నీకు గుడికి రావడం ఇష్టం లేదని చెప్పు అని కావ్యతో అంటాడు.నేనెందుకు చెప్తాను ఇష్టం లేనిది మీకు కదా అంటుంది కావ్య. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అంటాడు రాజ్. నాకు కొంచెం రెస్పెక్ట్ కావాలి అంటుంది కావ్య నాకు మీ నుంచి విముక్తి కావాలి ఇస్తావా అంటాడు రాజ్. నాకు కొంచెం మనశ్శాంతి కావాలి అంటుంది కావ్య. చచ్చిన నిన్ను మనశాంతిగా ఉండనివ్వను అంటాడు రాజ్.గుడికి వెళ్తున్నాను కదా ఏ కలర్ సారీ కట్టుకోమంటారు, రెడ్ కలర్ ఓకేనా అని అడుగుతుంది కావ్య.నేను అడిగేది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి అంటూ ఫ్రెస్టేట్ అవుతాడు. తరువాయి భాగంలో భార్యని ఎత్తుకొని ప్రదక్షిణలు చేస్తున్న రాజ్  ని చూసి ఆనందంతో కన్నీరు పెట్టుకుంటుంది కనకం. ఈర్షతో రగిలిపోతుంది స్వప్న

click me!

Recommended Stories