ఎపిసోడ్ ప్రారంభంలో వేద, యష్ ఇద్దరు ఐ లవ్ యు చెప్పుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చప్పట్లు కొడతారు. ఇద్దరూ దండలు కూడా మార్చుకుంటారు. ఒక్కసారిగా ఊహల నుంచి బయటకు వస్తాడు యష్. ఎదురుగా ఉన్న కొరియర్ ఓపెన్ చేస్తే అందులో విన్ని, వేద ల ఫోటోలు చూసి అప్సెట్ అవుతాడు. కోపంతో రగిలిపోతాడు.