తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

చిరు, బాలయ్య, పవన్‌, ఎన్టీఆర్‌, కొరటాల, దిల్‌రాజు.. సినిమా స్టార్స్ తో రేవంత్‌ రెడ్డి.. అరుదైన ఫోటోలు

Aithagoni Raju | Updated : Dec 05 2023, 07:16 PM IST

తెలంగాణ సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఆయనతో సినిమా సెలబ్రిటీలు దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అందులో బిగ్‌ స్టార్స్ ఉన్నారు.   

115
చిరు, బాలయ్య, పవన్‌, ఎన్టీఆర్‌, కొరటాల, దిల్‌రాజు.. సినిమా స్టార్స్ తో రేవంత్‌ రెడ్డి.. అరుదైన ఫోటోలు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఈ రాత్రి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన అంశాలు ప్రతిదీ ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగా సినిమా సెలబ్రిటీలతో ఉన్న అరుదైన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

215

రేవంత్‌రెడ్డికి సినిమా ఇండస్ట్రీతో ప్రత్యక్ష సంబంధాలు చాలా తక్కువే. ఆయన ఎక్కువగా రాజకీయంగా, వ్యాపార రంగంలో మాత్రమే ఉన్నారు. కాకపోతే టీడీపీలో ఉన్న సమయంలో, అడపాదడపా ఆయన సినిమా సెలబ్రిటీలను కలిశారు. ఆయనతో తెలుగు సినిమా ప్రముఖులు కలిసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

315

రేవంత్‌ రెడ్డికి కూతురు పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. రేవంత్‌ కూతురుని ఆశీర్వదిస్తున్నప్పుడు దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

415

ఓ రాజకీయ వేదికపై జనసేన అధినేత, స్టార్‌ హీరో పవర్‌ కళ్యాణ్‌తో రేవంత్‌ రెడ్డి మాటామంతి. ఇప్పుడిది నెట్టింట వైరల్‌ అవుతుంది. 

515

ఓ అవార్డు ఫంక్షన్‌లో ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు.. రేవంత్‌రెడ్డితో దిగిన ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

615

2009 టైమ్‌లో టీడీపీ కోసం ఎన్టీఆర్‌ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌తో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యం. ఇప్పుడిది నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

715

2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సమయంలో ఎన్టీఆర్‌తో రేవంత్ రెడ్డి. ఆసమయంలో ఈ ఇద్దరు చాలా క్లోజ్‌గా మూవ్‌ అయ్యారు.

815

ఎన్టీఆర్‌కి చెందిన ఓ సినిమా ఓపెనింగ్‌ ఫంక్షన్‌కి గెస్ట్ గా వచ్చిన రేవంత్‌రెడ్డి. చిత్రంలో దర్శకుడు కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలున్నారు. 

915

బాలకృష్ణకి, రేవంత్‌ రెడ్డి కి మంచి అనుబంధం ఉంది. ఇద్దరు గతంలో టీడీపీలో ఉన్న నేపథ్యంలో తరచూ కలుస్తుండే వారు.ఈ  నేపథ్యంలో ఆయా పిక్స్ ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. 

1015

బాలకృష్ణకి, రేవంత్‌ రెడ్డి కి మంచి అనుబంధం ఉంది. ఇద్దరు గతంలో టీడీపీలో ఉన్న నేపథ్యంలో తరచూ కలుస్తుండే వారు.ఈ  నేపథ్యంలో ఆయా పిక్స్ ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. 

1115

రేవంత్‌ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఆయన యాక్టివ్‌గా రాజకీయ కార్యక్రమాల్లో ఉన్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా నిర్మాత బండ్ల గణేష్‌ కలిశారు. ఆ పిక్స్ ఇప్పుడు బాగా వైరల్‌ అవుతున్న పిక్‌లో ఒకటిగా నిలుస్తుంది. 

1215

రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోనూ తెలంగా కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుందనే వార్తలతో ఆయన్ని కలిసిన నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌.

1315

దేవా కట్టా ఇటీవల సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా `రిపబ్లిక్‌` చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో రేవంత్‌ రెడ్డి, సీతక్క పాల్గొన్నారు. 

1415

సంగీత దర్శకుడిగా స్ట్రగుల్‌ అవుతున్న చరణ్‌ అర్జున్‌ కి రేవంత్‌ రెడ్డితో మంచి అనుబంధం ఉంది.ఓ ఈ సందర్బంలో కలిసిన ఫోటోని పంచుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు చరణ్‌. 

1515

తెలుగు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఆ మధ్య రేవంత్‌రెడ్డిని కలిసింది. తన కూతురు సుప్రియతో కలిసి ఈ ఫోటో దిగారు. అయితే రేవంత్‌ రెడ్డి సీఎం కాబోతున్న నేపథ్యంలో ఈ అరుదైన ఫోటోని పంచుకుని అభినందనలు తెలిపారు. అయితే అంతకు ముందు సీఎం కేసీఆర్‌కి అభినందనలు తెలిపారు. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో వెంటనే ప్లేట్‌ పిరాయించి ఫోటో మార్చి అభినందనలు తెలియజేయడం హాట్‌ టాపిక్‌ అయిన విషయం తెలిసిందే. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!
Recommended Photos