Chiranjeevi: సంక్రాంతి కానుకగా వచ్చిన మన శంకరవ వరప్రసాద్ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. థియేటర్‌తో పాటు ఓటీటీలో సందడి చేసిన ఈ మూవీ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
చిరంజీవి ప్రధాన పాత్రలో, నయనతార కథానాయికగా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించారు. కుటుంబ వినోదం, కామెడీ టైమింగ్, యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సీజన్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రీజనల్ స్థాయిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కాగా ఈ సినిమా దాదాపు 80 కోట్లకుపైగా లాభాలను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మెగాస్టార్ వింటేజ్ స్టైల్, డైరెక్టర్ కామిక్ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
25
ఓటీటీలో రికార్డు స్థాయి స్పందన
థియేటర్ల తర్వాత ZEE5 లో విడుదలైన ఈ చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన తొలి 24 గంటల్లోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు నమోదు చేయడం విశేషం. సాధారణంగా భారీ బాక్సాఫీస్ హిట్లు ఓటీటీలో అదే స్థాయిలో రాణించటం అరుదు. అయితే ఈ చిత్రం డిజిటల్ ప్రపంచంలో కూడా ప్రభంజనం సృష్టించింది.
35
జీ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్
ఇప్పుడీ బ్లాక్‌బస్టర్ బుల్లితెరకు రానుంది. జీ తెలుగు ఫిబ్రవరి 28 సాయంత్రం 5:30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయనున్నట్టు ప్రకటించింది. స్ట్రీమింగ్ హక్కులతో పాటు శాటిలైట్ హక్కులు కూడా జీ సంస్థే సొంతం చేసుకుంది. థియేటర్, ఓటీటీ తర్వాత టెలివిజన్ లో కూడా మంచి టీఆర్‌పీ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుమారు 200 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అయ్యిందని సమాచారం. ప్రచార ఖర్చులతో కలిపి మొత్తం వ్యయం 250 కోట్లకు చేరింది. ప్రీ రిలీజ్ బిజినెస్ దశలోనే భారీ డిమాండ్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 100 కోట్ల విలువైన హక్కులు అమ్ముడయ్యాయి. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా మంచి రేటుకు హక్కులు విక్రయమయ్యాయి. విడుదలకు ముందే 120 కోట్లకు పైగా వ్యాపారం నమోదు కావడం విశేషం.
55
బాక్సాఫీస్ కలెక్షన్లు
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 160 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అంచనాలకు మించి కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటకలో 20 కోట్లకు పైగా, ఇతర రాష్ట్రాల్లో కలిపి మంచి వసూళ్లు నమోదయ్యాయి. మొత్తంగా భారతదేశంలో దాదాపు 190 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు కావడంతో ఈ చిత్రం భారీ లాభాలను అందించింది. బాక్సాఫీస్ విజయంతో పాటు ఓటీటీ, టీవీ హక్కుల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం వచ్చింది.