Rashmika Mandanna Diet : రష్మిక డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా..? నేషనల్ క్రష్ ఇష్టంగా తినే ఫుడ్ ఇదే ?

Published : Feb 22, 2026, 06:00 AM IST

రష్మిక మందన్నా పక్కా 'ఫూడీ'. అయినా సరే బ్యాలెన్స్‌డ్ డైట్‌కే ఆమె ఓటు. పొద్దున్నే యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం అస్సలు మర్చిపోదట. దాని టేస్ట్ నచ్చకపోయినా, ఆరోగ్యం కోసం తప్పకుండా తీసుకుంటుంది. కానీ ఆమె అసలు డైట్ సీక్రెట్ వేరే ఉంది.

PREV
17
ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండటానికి

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో దూసుకెళ్తున్న సౌత్ బ్యూటీ రష్మిక మందన్నాను ఫ్యాన్స్ 'నేషనల్ క్రష్' అని పిలుచుకుంటారు. నటనతో పాటు తన ఫిజిక్, నవ్వుతో లక్షల మంది మనసులు గెలుచుకుంది. మరి 'పుష్ప' బ్యూటీ ఇంత ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండటానికి ఏం చేస్తుందో తెలుసా? ఆ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవే.

27
ఇంటి భోజనమే ఉత్తమం

హీరోయిన్లు డైట్ అనగానే కఠినమైన నియమాలు పాటిస్తారని అనుకుంటాం. కానీ రష్మిక మాత్రం 'ఇంటి భోజనమే ఉత్తమం' అంటోంది. ప్రపంచంలోని అన్ని డైట్ ప్లాన్స్‌ను ప్రయత్నించిందట. కానీ చివరికి తనకు సంతృప్తిని, పోషణను ఇచ్చింది మాత్రం తాను పెరిగిన 'ఇంటి భోజనం' (మాత్రమేనని చెబుతోంది.

37
సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ప్రాణం

రష్మిక పక్కా 'ఫూడీ'. ఆమె బ్యాలెన్స్‌డ్ డైట్‌ను నమ్ముతుంది. ఉదయం లేవగానే యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం మర్చిపోదు. దాని రుచి నచ్చకపోయినా, ఆరోగ్యం కోసం తప్పకుండా తీసుకుంటుంది. ఇక సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఈమెకు ప్రాణం. మధ్యాహ్నం భోజనంలో అన్నం బదులు కూరగాయలతో చేసిన రకరకాల సాంబార్లు, కూరలు తినడానికి ఇష్టపడుతుంది.

47
ఎక్కడికి వెళ్లినా.. వెంట తీసుకెళ్తుంది?

డైట్ పేరుతో రష్మిక ఉపవాసాలు ఉండదు. వీకెండ్స్‌లో సుషీ, సూప్ నూడుల్స్, తనకు ఇష్టమైన స్వీట్స్ తింటుంది. చాక్లెట్, ఐస్ క్రీమ్, డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం. కానీ వాటిని మితంగా తిని, జీర్ణం చేసుకోవడానికి వర్కౌట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఆమె ముఖం మెరవడానికి ముఖ్య కారణం 'హైడ్రేషన్'. ఎక్కడికి వెళ్లినా తన వాటర్ బాటిల్‌ను వెంట తీసుకెళ్తుంది.

57
రష్మిక మందన్న ఫిట్ నెస్ రహస్యం..?

రష్మిక ఫిట్ బాడీ వెనుక చాలా కఠోర శ్రమ ఉంది. ఆమె ప్రతిరోజూ జిమ్‌లో చెమటలు చిందిస్తుంది. తన వర్కౌట్‌లో 'కిక్ బాక్సింగ్'కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇది బరువు తగ్గించడానికే కాకుండా, మానసిక ఒత్తిడిని తగ్గించి, బాడీని యాక్టివ్‌గా ఉంచడంలో సాయపడుతుందని ఆమె నమ్మకం.

67
రష్మిక మందన్నా మాట్లాడుతూ

రష్మిక మాట్లాడుతూ.. "ఎంత పని ఉన్నా, ఎలాంటి పరిస్థితిలోనైనా నేను వర్కౌట్ చేయడం ఆపను" అని ఆమె గతంలో చెప్పింది. ఆమె ఫిట్‌నెస్ కేవలం బయటి రూపం కోసం కాదని, శరీరం ఫ్లెక్సిబిలిటీ (Flexibility), బలం పెంచుకోవడం కోసమని ఆమె అభిప్రాయం.

77
విజయ్ దేవరకొండతో పెళ్లి

మొత్తం మీద, బ్యాలెన్స్‌డ్ డైట్, ఇంటి భోజనం, రెగ్యులర్ వ్యాయామమే రష్మిక మందన్నా గ్లామర్ వెనుక ఉన్న అసలు సీక్రెట్. విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తలు వస్తున్న ఈ టైంలో, రష్మిక ఫిట్‌నెస్ మంత్రాలు ఆమె అభిమానులకు స్ఫూర్తినిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories