చిరంజీవి ఒకసారి తనని తాను అద్దంలో చూసుకుని ఓ మాట అనుకున్నారట. క్రేజీ డైరెక్టర్ తో ఈ విషయాన్ని చిరంజీవి రివీల్ చేశారు. అసలు చిరంజీవి ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ అలరించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.
25
చిరంజీవి కామెడీ టైమింగ్
గత కొన్నేళ్లుగా చిరంజీవి లోని ఫన్ యాంగిల్ ని అభిమానులు మిస్ అవుతూ వచ్చారు. మరి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా ఏ మేరకు అభిమానుల కోరిక తీర్చుతుందో చూడాలి. గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తన కామెడీ టైమింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ చిరంజీవిని ఇంటర్వ్యూలో చేశారు.
35
అద్దం ముందు నిలబడి అనుకున్న మాట
ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ పాలిటిక్స్ లో ఉన్న ఏడేళ్లు సినిమాలు చేయలేదు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సైరా, ఆచార్య లాంటి సీరియస్ సినిమాలు చేశాను. ఖైదీ నెంబర్ 150లో కొంత వరకు మాత్రమే వినోదం ఉంటుంది. పూర్తి స్థాయిలో వినోదాత్మక చిత్రం చేసి చాలా రోజులు అవుతోంది. దీనితో పక్కన వాళ్ళు జోక్ వేసినా నవ్వు రావడం లేదు. ఒకసారి అద్దం ముందు నిలబడి నాకు నేను అనుకున్నా.. ఏంటి నీలో హాస్య గ్రంధులు చచ్చిపోయాయా అని ప్రశ్నించుకున్నట్లు చిరంజీవి తెలిపారు.
నా సినిమాలలోనే రీమేక్ చేయాల్సి వస్తే మంచి కామెడీ ఉన్న సినిమాలు చేస్తాను అని అన్నారు. వెంటనే హరీష్ శంకర్ ఆ సినిమాలు ఏంటి నా చెవిలో చెప్పండి అని ఆసక్తి కనబరిచారు. చిరంజీవి సమాధానం ఇస్తూ దొంగ మొగుడు, రౌడీ అల్లుడు అని అన్నారు.
55
అనిల్ రావిపూడికి ఛాన్స్
ఆసక్తి కనబరిచిన హరీష్ శంకర్ కి చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఇంకా రాలేదు. ఆ ఛాన్స్ అనిల్ రావిపూడి దక్కింది. కానీ అనిల్ రావిపూడి చేస్తున్నది రీమేక్ కాదు. స్ట్రైట్ మూవీ. ఈ మూవీలో చిరంజీవి, నయనతార భార్యాభర్తలు గా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.