
పవన్ కళ్యాణ్ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ మూవీ ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత `గోకులంలో సీత` చిత్రంతో మెప్పించారు. ఇందులో శ్రీహరి నెగటిల్ రోల్ చేయగా, రాశి హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత `సుస్వాగతం` చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నారు. `తొలి ప్రేమ`తో బిగ్ బ్రేక్ అందుకుని స్టార్ అయిపోయారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా, యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోగా రాణించారు. అదే ఫాలోయింగ్ ఇప్పటికీ కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. అలా కల్ట్ హీరోగా ఎదిగారు పవన్.
ఇదిలా ఉంటే కెరీర్ ప్రారంభంలో పవన్ కళ్యాణ్‌కి ఆయన వదిన(చిరంజీవి భార్య) సురేఖ హీరోయిన్ ని వెతికిందట. `గోకులంలో సీత` మూవీకి హీరోయిన్‌ని ఆమెనే ఎంపిక చేసిందట. ఈ విషయాన్ని హీరోయిన్ రాశి నే చెప్పింది. బాలనటిగా రాణించిన రాశి తమిళంలో `ప్రియం` అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఇది ఆమెకి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా కారణంగానే తెలుగులో జగపతిబాబు సరసన `శుభాకాంక్షలు` చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా విడుదలై పెద్ద హిట్ అయ్యింది.
`శుభాకాంక్షలు` మూవీలో రాశి ని చూసిన సురేఖ ఈ అమ్మాయి బాగుంది, కళ్యాణ్ బాబుకి బాగా సెట్ అవుతుందని భావించిందట. అప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో `గోకులంలో సీత` మూవీ తీసేందుకు ప్లాన్ జరుగుతుంది. హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఆ సమయంలోనే సురేఖ.. `శుభాకాంక్షలు`లో రాశిని చూసి చిరంజీవికి చెప్పిందట. ఆయన రాశిని ఇంటికి పిలిపించారు. ఆ సమయంలో చిరు కూడా చెన్నైలోనే ఉన్నారు. చిరంజీవి నుంచి పిలుపు వచ్చిందని హుటాహుటిని వచ్చింది రాశి. ఇంటికి వెళ్లగానే చిరంజీవి ఉన్నారు. ఆయన ఆమెని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చిరంజీవితో పలు సినిమాల్లో రాశి బాలనటిగా నటించింది. ఇప్పుడు హీరోయిన్‌గా అంటే ఆయన కూడా కొంత ఆశ్చర్యపోయారట.
ఆ తర్వాత సురేఖని పిలిచి పరిచయం చేశారట. ఆమెకి బాగా నచ్చిందట రాశి. వెంటనే ఓకే చేశారట. అయితే అప్పటి వరకు రాశికి తెలియదు, తనని పిలిపించింది సురేఖ అని, చిరంజీవి ఆ సమయంలో చెప్పడంతో తాను కూడా షాక్ అయ్యిందట. అలా తనని సురేఖ మేడం `గోకులంలో సీత`కి ఎంపిక చేసిందని తెలిపింది హీరోయిన్ రాశి. హిట్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుందామె. ఇది తనకు గొప్ప మెమొరబుల్ మూమెంట్ అని, ఎప్పటికీ ఆ సందర్భాన్ని మర్చిపోలేనని వెల్లడించింది రాశి.
రాశీకి తెలుగులో `శుభాకాంక్షలు`, `గోకులంలో సీత`, `పెళ్లి పందిరి` వంటి చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కావడంతో తెలుగుకే ప్రయారిటీ ఇచ్చింది. ఇక్కడ చాలా వరకు హోమ్లీ రోల్స్ చేసి మెప్పించింది. ఫ్యామిలీ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. `పండగ`, `సుప్రభాతం`, `స్నేహితులు`, `మనసిచ్చి చూడు`, `స్వప్నలోకం`, `ప్రేయసి రావే`, `ఒకే మాట`, `మూడు ముక్కలాట`, `అమ్మో ఒకటో తారీఖు`, `దేవుళ్లు`, `మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది`, `దీవించండి`, `సందడే సందడి` వంటి చిత్రాలతో విజయాలు అందుకుంది. అప్పట్లో అత్యంత బిజీ హీరోయిన్‌గా రాణించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ మూవీస్ చేసింది. తెలుగులో `నిజం` తర్వాత ఆమె బ్యాక్ అయ్యింది. ఇందులో నెగటివ్ రోల్ చేసింది. దీంతో విమర్శలు ఎదుర్కొంది. అది తట్టుకోలేక సినిమాలకు దూరమయ్యింది రాశి. ఇప్పుడు మళ్లీ తెలుగులో నటించేందుకు సిద్దంగా ఉంది. అయితే ఇప్పటికే ఈమె సీరియల్స్ తోనూ బిజీగా ఉండటం విశేషం.
ఇక పవన్ కళ్యాణ్ ని వదిన సురేఖ సొంత కొడుకులా చూసుకుంటుంది. తమ మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉండటంతో, పైగా చిన్నప్పట్నుంచి ఇంట్లోనే పెరగడంతో పెద్ద కొడుకులాగానే భావిస్తుంది సురేఖ. అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా ఆమెని అమ్మలాగే ట్రీట్ చేస్తారు. అమ్మ మీద అలిగినట్టుగానే ఆమె మీద అలుగుతాడట. అది వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం. ఈ బాండింతోనే పవన్‌కి ప్రారంభంలో సినిమాలకు సంబంధించిన హీరోయిన్ ఎంపిక చేసిందని, ఇతర విషయాల్లోనూ ఆమె భాగమయ్యిందని సమాచారం.