సూపర్‌ స్టార్ కృష్ణకి చిరంజీవి విలన్‌గా నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? బాక్సాఫీసు రిజల్ట్ కి మతిపోవాల్సిందే

Published : Jun 22, 2025, 05:21 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి తన కెరీర్‌ ప్రారంభంలో చాలా వరకు నెగటివ్‌ రోల్స్ చేశారు. అయితే ఆయన సూపర్‌ స్టార్‌ కృష్ణతో ఒక మూవీలో విలన్‌గా చేశారు, ఆ చిత్రం ఏంటనేది చూస్తే. 

PREV
15
సూపర్‌ స్టార్‌ కృష్ణకి విలన్‌గా నటించిన చిరంజీవి

చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్‌ గా రాణిస్తున్నారు. తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. కానీ ఆయన కెరీర్‌ ప్రారంభంలో నెగటివ్‌ రోల్స్ కూడా చేశారు. చాలా సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించి అదరగొట్టాడు. 

హీరో అయినా, విలన్‌ అయినా చిరంజీవిలోని ఆ గ్రేస్‌, ఆ చురుకుతనం, ఆ కసి అలానే ఉన్నాయి. అదే ఎనర్జీ లెవల్‌ చూపించారు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. మేకర్స్ దృష్టిని ఆకర్షించాడు. 

అయితే చిరంజీవి అప్పట్లో సూపర్‌ స్టార్‌ కృష్ణకి విలన్‌గా నటించడం విశేషం. ఒకే ఒక్క మూవీలో కృష్ణకి ఆయన నెగటివ్‌ రోల్‌ చేశారు. మరి ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.

25
చిరంజీవి విలన్‌గా నటించిన మూవీ `కొత్త అల్లుడు`

చిరంజీవి, సూపర్‌ స్టార్‌ కలిసి మూడు సినిమాల్లో నటించారు. కానీ కృష్ణ హీరోగా, చిరంజీవి విలన్‌గా నటించిన ఒకే ఒక్క మూవీ `కొత్త అల్లుడు`. 1979లో వచ్చిన ఈ మూవీలో సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా నటిస్తే, జయప్రద హీరోయిన్‌గా చేసింది. 

సాంబశివరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి అప్పట్లో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా రాణించిన కేవీ మహదేవన్‌ సంగీతం అందించడం విశేషం. ఇందులో చిరంజీవితోపాటు కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు, నటుడు కైకాల సత్యనారాయణ ముఖ్య పాత్రలు పోషించారు.

 అయితే వీరివి నెగటివ్‌ రోల్స్ కావడం విశేషం. ఇందులో వీరితోపాటు అల్లు రామలింగయ్య, రాజాబాబు, హేమా చౌదరి, గుమ్మడి వెంకటేశ్వరరావు, నూతన్ ప్రసాద్‌, రమాప్రభ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 1979 మే 31న విడుదలైంది.

35
`కొత్త అల్లుడు మూవీ కథ ఏంటంటే?

`కొత్త అల్లుడు` మూవీ కథ విషయానికి వస్తే, మనిషి ఎప్పటికీ చనిపోకుండా ఉండేందుకు, ఎక్కువ కాలం బతికేందుకు సంజీవని మందు తయారు చేస్తుంటారు ఒక పేరు మోసిన వ్యాపారవేత్త(గుమ్మడి). ఆయనది మెడిసిన్‌(ఫార్మా) వ్యాపారం.

 కానీ తనకు మగ సంతానం లేదు. నలుగురు అమ్మాయిలు. ముగ్గురు కూతుళ్లకి వచ్చిన భర్తలు మోసగాళ్లు, అదే సమయంలో అత్తగారింటికి ఇల్లరికం వస్తారు. మామ కంపెనీల్లోనే పనిచేస్తుంటారు. వారికి స్వేచ్ఛ లేదు. మామ చెప్పిందే చేయాలి.

 దీంతో మామ కింద గుమస్తాలుగా బతికాల్సిన పరిస్థితి. దీంతో ఆ ముగ్గురు అల్లుళ్లు కుట్రలు చేస్తుంటారు. వారిలో పెద్ద అల్లుడు కైకాల సత్యనారాయణ, ఆయన తమ్ముడే చిరంజీవి. నకిలీ మెడిసిన్ తయారు చేస్తున్నారని, ఆ ఫార్మా కంపెనీపై కృష్ణ దాడి చేస్తాడు. 

ఈ క్రమంలో అటు వ్యాపారవేత్త అల్లుళ్లకి, ఇటు కృష్ణకి మధ్య వార్‌ స్టార్ట్ అవుతుంది. ఇక ఆ వ్యాపారవేత్త తన నాల్గో కూతురే జయప్రద. ఆమె పెళ్లికి ఈ సంజీవని మందు కానుకగా ఇవ్వాలని తాపత్రయపడుతుంటాడు. 

మరి ఆ కోరిక నెరవేరిందా? ఆ వ్యాపారవేత్త జీవితంలోకి కృష్ణ ఎలా వచ్చాడు? ఏం చేశాడు? నాల్గో కూతురుకి ఎలా దగ్గరయ్యాడు ? ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ.

45
అంచనాలు లేకుండా వచ్చి సూపర్‌ హిట్‌ అయిన `కొత్త అల్లుడు`

సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజున విడుదలైన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైంది. కానీ థియేటర్లలో మాత్రం మంచి విజయాన్ని సాధించింది. కలెక్షన్ల పరంగానూ మంచి వసూళ్లని రాబట్టడం విశేషం. 

అప్పట్లో దీనికి ఐఎండీబీ 8.3 రేటింగ్‌ ఇచ్చింది. ఈ లెక్కన ఇది సూపర్‌ హిట్‌గా చెప్పొచ్చు. ఈ చిత్రంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా అదరగొట్టగా, చిరంజీవి నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో నటించాడు. కృష్ణ మెడికల్‌ షాప్‌ హోనర్‌గా, చిరంజీవి మెడిసిన్‌ తయారు చేసే ఫ్యాక్టరీలో సూపర్‌ వైజర్‌గా నటించారు. 

వీరిద్దరి నటన సినిమాకే హైలైట్‌గా చెప్పొచ్చు. వీరి మధ్య ఫైట్‌ సీన్లు కూడా రక్తికట్టించేలా ఉంటాయి. ఇక చిరంజీవితోపాటు కైకాల సత్యనారాయణ, మోహన్‌బాబు కలిసి చేసే రచ్చ కూడా బాగుంటుంది. వీరి విలనిజం బాగా వర్కౌట్‌ అయ్యింది. 

అందుకే సినిమా రక్తికట్టింది. ఫ్యామిలీ యాక్షన్‌ డ్రామాగా ఇది విశేష ఆదరణ పొందడం విశేషం. వీటితోపాటు కృష్ణ, చిరంజీవి కలిసి `కొత్తపేట రౌడీ`, `తోడు దొంగలు` చిత్రాలు చేశారు. ఈ సినిమాలు కూడా విజయాలు సాధించాయి. 

ఆడియెన్స్ ని అలరించాయి. ఇలా కృష్ణ, చిరు కలిసి మూడు సినిమాల్లో మెరిశారు. వాటిలో ఒక్క చిత్రంలోనే చిరు విలన్‌గా నటించడం విశేషం.

55
నెగటివ్‌ రోల్స్ నుంచి మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి

చిరంజీవి ఇలా కొన్ని సినిమాల్లో నెగటివ్‌ రోల్స్ చేసి, ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నారు. వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నారు. `ఖైదీ` మూవీ ఆయన కెరీర్‌నే మార్చేసింది. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ని చేసింది. 

అప్పటి నుంచి చిరంజీవి హీరోగా కెరీర్‌ పరుగులు పెట్టిందని చెప్పొచ్చు. ఏడాదికి ఐదారు సినిమాలు చేసి, వరుసగా విజయాలు అందుకుని తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. యాక్షన్‌ సీన్లు, మాస్‌ డైలాగ్‌లు, డాన్సులతో ఆడియెన్స్ ని ఉర్రూతలూగించారు. మెగాస్టార్‌గా ఎదిగారు. 

ఇప్పటికీ అదే క్రేజ్‌, అదే ఇమేజ్‌, అదే రేంజ్‌లో ఆకట్టుకున్నారు చిరు. ప్రస్తుతం ఆయన `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా ఇది రూపొందుతుంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది. వీఎఫ్‌ఎక్స్ డిలే కారణంగా రిలీజ్‌ వాయిదా పడింది. 

ఈ దసరాకి విడుదలయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు అనిల్‌ రావిపూడితో ఓ మూవీ చేస్తున్నారు చిరు. ఇది మెగాస్టార్ మార్క్ యాక్షన్‌ కామెడీ డ్రామాగా ఉండబోతుందని, వింటేజ్‌ చిరుని చూపించోతున్నారట అనిల్‌ రావిపూడి. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories