చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై మళ్లీ చర్చ మొదలైంది. దర్శకుడు వశిష్ఠ తాజా పోస్ట్‌తో సినిమా రిలీజ్‌పై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు ఈ చిత్రం సంక్రాంతికి వస్తుంది అంటూ ప్రచారం జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’, ‘కాకా’ సినిమాలతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తయినప్పటికీ విడుదల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాకా’ చిత్రాన్ని 2027 జనవరి 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో చిరంజీవి నటించిన రెండు సినిమాల్లో ఏది సంక్రాంతి బరిలో ఉంటుందనే చర్చ మొదలైంది.
25
వశిష్ఠ పోస్ట్‌తో కొత్త ఊహాగానాలు
‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఈ చర్చను మరింత పెంచింది. శివుడికి సంబంధించిన ఓ ప్రవచన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘శ్వాస నాది, శాసనం నీది.. ఆశ నాది, పాశం నీది.. ఆత్మ నాది, ఆట నీది.. ఎంత మాయగాడివయ్యా! ఓం నమః శివాయ’’ అంటూ ఆయన రాసుకొచ్చారు. ‘‘ఇందుకేనా నిన్ను విశ్వంభరుడు అని పిలిచేది? సర్వం శివం’’ అంటూ ఆ పోస్టును ముగించారు. ఈ పోస్ట్‌కు ‘విశ్వంభర’ విడుదల పరిస్థితులకు ఏమైనా సంబంధం ఉందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
35
వీఎఫ్‌ఎక్స్ పనులే ప్రధాన కారణమా?
‘విశ్వంభర’కు సంబంధించిన చిత్రీకరణ ఎప్పుడో పూర్తయినప్పటికీ వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. కథలోని భారీ విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా ఉండటంతో వాటి పనులు పూర్తి చేయడానికి సమయం పడుతోందని గతంలో చిత్రబృందం నుంచి సమాచారం వచ్చింది. అయితే ఇప్పుడు విడుదల ఆలస్యానికి వీఎఫ్‌ఎక్స్‌తో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.
వీఎఫ్‌ఎక్స్ పనులను పూర్తి చేయడానికి మరింత బడ్జెట్ అవసరమవుతుందని, అయితే నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కారణంగా సినిమా పనులు కొంతకాలంగా నెమ్మదించాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘విశ్వంభర’ విడుదల విషయంలో స్పష్టత రావడం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆర్థిక అంశాలపై చిత్రబృందం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం ఇవి ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న వార్తలుగానే చూడాల్సి ఉంటుంది.
శ్వాస నాది, శాసనం నీది ఆశ నాది, పాశం నీది, ఆత్మ నాది, ఆట నీది… ఎంత మాయగాడివయ్యా! ఓం నమః శివాయ!!!
ఇదిలా ఉంటే వశిష్ఠ తన తదుపరి సినిమాపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నందమూరి మోక్షజ్ఞను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఆయన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన కథా పనుల్లో వశిష్ఠ బిజీగా ఉన్నారని సమాచారం. ముఖ్యంగా సెకండాఫ్‌పై ఆయన వర్క్ చేస్తున్నట్లు టాక్. దీంతో ‘విశ్వంభర’ విడుదల ఎప్పుడు ఉంటుందనే ఆసక్తి మరింత పెరిగింది. అయితే చిరంజీవి సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే వరకు సంక్రాంతి విడుదలపై జరుగుతున్న చర్చలకు స్పష్టత వచ్చే అవకాశం లేదు.