Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 రెండో వారం ఎలిమినేషన్‌.. కృష్ణుడు ఔట్‌ ?

Published : Sep 19, 2026, 05:32 PM IST

Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 రెండో వారం హౌజ్‌ ని ఎవరు వీడుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్‌ లీకేజీ బయటకు వచ్చింది. కృష్ణుడు ఎలిమినేట్‌ అయినట్టు సమాచారం.

PREV
14
బిగ్‌ బాస్‌ తెలుగు 10 రెండో వారం ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ మొదటి వారం హడావుడి జరిగింది. మిడ్‌ వీక్‌లో ఇద్దరిని ఎలిమినేట్‌ చేయడంతో అంతా షాక్‌ అయ్యారు. ఆడియెన్స్ తోపాటు కంటెస్టెంట్లు కూడా షాక్‌లోకి వెళ్లారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అది ఆడియెన్స్ కి క్యూరియాసిటీని పెంచింది. అదే సమయంలో గందరగోళాన్ని క్రియేట్‌ చేసింది. ఈ క్రమంలో మళ్లీ రెండో వారంలో ఆడియెన్స్ ఓటింగ్‌ పెట్టి ఎలిమినేట్‌ అయిన వారిలో ఒక్కరిని హౌజ్‌లోకి తీసుకొచ్చారు. చరణ్‌ మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రెండో వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది క్యూరియాసిటీగా మారింది.

24
బిగ్‌ బాస్‌ తెలుగు 10 నామినేషన్‌లో ఉన్నది వీరే

రెండో వారంలో నామినేషన్‌లో రోహిత్‌, త్రిగుణ్‌, ముఖేష్‌ గౌడ, రాం ప్రసాద్‌, దేబ్జానీ, షాలిని, ఝాన్సీ, సృష్టి, సుధీర్‌, కృష్షుడు, వర్షిణి ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే మొదటి నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అయ్యే విషయంలో ఓ క్లారిటీ వస్తోంది. ప్రధానంగా ముగ్గురి మధ్యనే ఈ పోటీ కనిపించింది. ఓటింగ్‌లో లీస్ట్ లో కృష్ణుడు, సుధీర్‌, వర్షిణి ఉన్నారు. కానీ చివర్లో వర్షిణి పుంజుకుంది. ఆ తర్వాత సృష్టి లీస్ట్ లోకి వచ్చింది. దీంతో కృష్ణుడు, సుధీర్, సృష్టిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అన్నారు.

34
కృష్ణుడు ఎలిమినేట్‌?

లేటెస్ట్ సమాచారం మేరకు ఈ వారం హౌజ్‌ని వీడేది కృష్ణుడే అని తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతుందని, ఓటింగ్‌ లెక్కలు బయటకు రావడంతో లీస్ట్ లో ఉన్న కృష్ణుడిని హౌజ్‌ నుంచి ఇంటికి పంపించే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన ఎలిమినేషన్‌ ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అయ్యింది. ఆల్‌రెడీ సోషల్‌ మీడియాలో కృష్ణుడు ఎలిమినేట్‌ అనే ప్రచారం జరుగుతుంది. లీక్‌ సమాచారం మేరకు కూడా ఆయన ఎలిమినేషన్‌ ఆల్‌రెడీ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. మొత్తంగా రెండో వారంలో కృష్ణుడు హౌజ్‌ని వీడుతున్నాడని చెప్పొచ్చు.

44
కృష్ణుడు కంటెంట్ ఇవ్వలేకపోయాడా?

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ హౌజ్‌లో తానేంటో నిరూపించుకోవాలని, తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాలని, తన టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకోవాలని బిగ్‌ బాస్‌కి వచ్చినట్టు తెలిపారు కృష్ణుడు. కానీ ఆయన నుంచి పెద్దగా కంటెంట్ బయటకు రాలేదు. ఆడియెన్స్ కి చూపించిన కంటెంట్‌లో కృష్ణుడికి సంబంధించిన కంటెంట్‌ పెద్దగా లేదు. వాదనల విషయంలోనూ ఆయన పెద్దగా హడావుడి చేయలేదు. ప్రారంభంలో కొంచెం హడావుడి చేశారు, కానీ ఆ తర్వాత ఆ స్థాయి కనిపించలేదు. అదే ఆయనకు పెద్ద దెబ్బగా మారింది, దీని వల్ల ఓటింగ్‌ తక్కువగా వచ్చాయని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories