చిత్ర పరిశ్రమలో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. సెంటిమెంట్లకు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఎవరూ అతీతులు కారు. టాలీవుడ్ సెలెబ్రెటీలకు పాజిటివ్ గా వర్కౌట్ అయిన సెంటిమెంట్లు, అలాగే చేదు జ్ఞాపకాలు మిగిల్చిన సెంటిమెంట్లు ఉంటాయి. ఒక సెంటిమెంట్ మాత్రం టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లకు బలంగా వర్కౌట్ అయింది.
Chiranjeevi
ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.చిత్ర పరిశ్రమలో సంక్రాంతి తమ సినిమా రిలీజ్ చేయాలని చాలా మంది హీరోలు పోటీ పడుతుంటారు. సంక్రాంతి కాకుండా టాలీవుడ్ లో చాలా మందికి ఇష్టమైన తేదీ మరొకటి ఉంది. అదే మే 9. ఈ తేదికి ఉండే ప్రత్యేకత వేరు. ఈ తేదీని మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున తో పాటు కీర్తి సురేష్ కూడా జీవితంలో మరచిపోలేదు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం మే 9 న విడుదలయింది. చిరంజీవి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో ఈ మూవీ ఒకటిగా నిలిచింది. ఆల్ టైం క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి గుర్తింపు ఉంది. ఈ చిత్రం రిలీజ్ అయిన టైంలో ఏపీలో తీవ్రమైన ఫాన్ విజృంభిస్తోందట. తొలి మూడు రోజుల వరకు సినిమా పరిస్థితి ఏంటి అన్నది నిర్మాత అశ్విని దత్ కి కూడా తెలియదట.
మూడవ రోజు తర్వాత నుంచి తుఫాన్ ప్రభావం తగ్గడంతో బాక్సాఫీస్ కలెక్షన్ల తుఫాన్ మొదలైంది. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 1990లో ఈ చిత్రం విడుదలయింది. విక్టరీ వెంకటేష్ కి కూడా మే 9 మెమొరబుల్ డేట్ అని చెప్పొచ్చు. 1997 మే 9న విక్టరీ వెంకటేష్ ప్రేమించుకుందాం రా చిత్రం విడుదలయింది. ఈ మూవీ కూడా తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఆ ఏడాది టాలీవుడ్ లో ఈ చిత్రమే బిగ్గెస్ట్ హిట్. ఈ చిత్రంలో వెంకీ, అంజల జవేరి జంటగా నటించారు. జయంత్ సి పరాన్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2002లో నాగార్జున నటించిన సంతోషం చిత్రం ఇదే తేదీన విడుదలైంది. ఆ టైంకి సంతోషం చిత్రం నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. చిరు, వెంకీ, నాగార్జున మాత్రమే కాదు కీర్తి సురేష్ కి కూడా మే 9 చాలా లక్కీ. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి చిత్రంలో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటించింది. ఈ చిత్రానికి ఆమె ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది.