ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 చిత్రం దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది.
పాన్ ఇండియా మార్కెట్ కారణంగా ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలంతా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అందరి రెమ్యునరేషన్ 100 కోట్లు టచ్ అవుతున్నట్లు టాక్. అయితే పుష్ప 2 చిత్రానికి బన్నీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనేది కూడా ఆసక్తిగా మారింది. జరుగుతున్న ప్రచారం ప్రకారం బన్నీ రెమ్యునరేషన్ 10 నుంచి 150 కోట్ల వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది.
బన్నీతో, అల్లు ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉండే నిర్మాత బన్నీ వాసు తాజాగా అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్.. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి 150 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఇది నిజమా అని ప్రశ్నించారు. దీనికి బన్నీ వాసు సమాధానం ఇస్తూ.. ఒక వేళ బన్నీ నిజంగా 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే అది చాలా తక్కువ అని అన్నారు.
బన్నీకి పాన్ ఇండియా క్రేజ్ ఉంది. పుష్ప 2 చిత్రం కోసం అల్లు అర్జున్ గత మూడేళ్ళ నుంచి కష్టపడుతున్నాడు. అల్లు అర్జున్ తీసుకునే 150 కోట్లలో దాదాపు 50 కోట్లు ట్యాక్స్ రూపంలోనే పోతాయి. ఇక అల్లు అర్జున్ కి వచ్చేది 100 కోట్లు. మూడేళ్లకు 100 కోట్లు అంటే..ఏడాదికి బన్నీకి దాదాపు 33 కోట్లు మాత్రమే.
ఈ లెక్కన చూసుకుంటే అల్లు అర్జున్ రెమ్యునరేషన్ చాలా తక్కువ అని బన్నీ వాసు అన్నారు. కానీ బయటకి కనిపించేది మాత్రం బన్నీ 150 కోట్లు తీసుకుంటున్నాడు అని అంతా అంటారు. ఈ విషయాలన్నీ తెలియవు అని బన్నీ వాసు తెలిపారు. పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.