2004లో అమ్మాయి విషయంలో గొడవ మ్యాటర్‌ బయటపెట్టిన గోపీచంద్‌, ప్రభాస్‌కి ఒక్కసారిగా ఫ్యూజుల్ ఔట్‌

First Published | Sep 25, 2024, 1:52 PM IST

ప్రభాస్‌, గోపీచంద్‌ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ల మధ్య చాలా ఏళ్లుగా ఆ స్నేహం కొనసాగుతుంది. కానీ ఓ అమ్మాయి విషయంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. 
 

ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా ఇమేజ్‌ని దాటి, గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాలకు విదేశాల్లో భారీ క్రేజ్‌ ఉంటుంది. నార్త్ అమెరికాలో అయితే `కల్కి 2898 ఏడీ` సరికొత్త రికార్డులు తిరగరాసింది. అంతటి ఇమేజ్‌ ఉన్నా వ్యక్తిగతంగా ప్రభాస్‌ మాత్రం చాలా కూల్‌. ఎలాంటి ఈగో ఉండదు, ఎలాంటి కల్మషం, స్వార్థం లేదు.

డేంజర్‌ జోన్‌లో సోనియా.. బిగ్‌ బాస్‌తెలుగు 8 ఇంట్రస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అంత పెద్ద స్టార్‌ అయినా సిగ్గు, బిడియంతో ఉంటాడు. అందుకే పబ్లిక్‌లోకి ఎక్కువగా రాదు, ఎక్కువగా మాట్లాడడు. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిపోతాడు. తాను మాట్లాడలేనని, కానీ సినిమాల ద్వారా ఎంటర్‌టైన్‌ చేస్తానని, ఏడాదికి రెండుమూడు సినిమాలిస్తానని చెబుతుంటాడు. అదే డౌన్‌ టూ ఎర్త్ యాటిట్యూడ్‌ ఫ్రెండ్స్ విషయంలోనూ చూపిస్తారు డార్లింగ్‌.

సాధారణంగా మరే ఏ స్టార్‌ అయినా ఇంతటి ఇమేజ్‌ వస్తే, ఫ్రెండ్స్‌ ని, బంధువులనే పక్కన పెడుతుంటారు. కానీ ప్రభాస్‌ మాత్రం అలా కాదు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఆయన సొంతం. ఎంత ఇమేజ్‌ వచ్చిన తన ప్రారంభం నాటి స్నేహాన్ని వదల్లేదు. అదే గోపీచంద్‌తో ఆయన స్నేహం.

ఈ ఇద్దరు ఇండస్ట్రీకి రావడానికి ముందు నుంచే స్నేహితులు. సినిమాల్లోకి వచ్చాక కూడా ఆ స్నేహం కొనసాగుతుంది. ఈ ఇద్దరు ఏకంగా కలిసి కూడా నటించారు. 
 


`వర్షం` సినిమాలో ప్రభాస్‌, గోపీచంద్‌ కలిసి నటించారు. ఇద్దరు హీరో విలన్లుగా చేయడం విశేషం. ఇందులో ప్రభాస్‌ హీరో అయితే, గోపీచంద్‌ విలన్‌గా చేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి వెండితెరపై మెరిసింది లేదు. `సలార్‌` లాంటి మూవీస్‌లో కలిసి నటిస్తే బాగుండు అని, సినిమా అదిరిపోయేదనే కామెంట్స్ వచ్చాయి. నిజంగానే ఇది సంచలనాత్మక మూవీ అయ్యేది. కానీ ఆ ఛాన్స్ మిస్‌ అయ్యింది. మేకర్స్ అలా ఆలోచించలేదు. కమర్షియాలిటీ కోణంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ని ఎంచుకున్నారు. 
 

prabhas gopichand

ఈ విషయాలు పక్కన పెడితే ఇరవై ఏళ్ల క్రితం ప్రభాస్‌, గోపీచంద్‌ మధ్య గొడవ అయ్యిందట. ఆ విషయాన్ని బయటపెట్టాడు గోపీచంద్‌. అది కూడా బాలయ్య ముందు ఈ సీక్రెట్‌ని లీక్‌ చేశాడు. దెబ్బకి ప్రభాస్‌ ఫ్యూజులు ఎగిరిపోయాయి. టెన్షన్‌తో చచ్చిపోయాడు. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే, ప్రభాస్‌, గోపీచంద్ కలిసి `వర్షం` సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ముందుగా చెప్పినట్టు ఇందులో ప్రభాస్‌ హీరోగా, గోపీచంద్‌ విలన్‌గా చేశారు. త్రిష హీరోయిన్‌. అందమైన అమ్మాయి కావడంతో ఆమెని దక్కించుకోవాలనుకుంటాడు గోపీచంద్. కానీ ఆమె ప్రభాస్‌ని ప్రేమిస్తుంది. ఆ అమ్మాయి కోసమే ఈ ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. అంతిమంగా విలన్‌ ని చంపి ప్రేమని గెలిపించుకుంటాడు ప్రభాస్‌. 

అయితే బాలయ్య టాక్‌ షో అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే షోలో పాల్గొన్న గోపీచంద్‌.. ప్రభాస్‌ తాను అమ్మాయి కోసం గొడవ పడ్డామని తెలిపారు. అది ఏ ఇయర్‌ అని అడగ్గా మొదట 2008 అని చెప్పారు గోపీచంద్. ఆ తర్వాత చెప్పు చెప్పు అని బాలయ్య క్యూరియాసిటీతో అడిగాడు. దానికి ట్విస్ట్ ఇస్తూ 2008లో కాదు సార్‌, 2004లో ఓ అమ్మాయి కోసం తామిద్దరం గొడవపడ్డామని తెలిపాడు గోపీచంద్.

ఏ అమ్మాయి అని బాలయ్య గుచ్చి గుచ్చి అడిగాడు, అమ్మాయి కోసం గోడవ అని చెప్పడంతో ప్రభాస్‌కి మతిపోయింది. వామ్మో వీడు ఏం చెప్పబోతున్నాడు? తనని ఇరికిస్తున్నాడా? ఏంటి అనేట్టుగా టెన్షన్‌ పడ్డాడు. చెప్పు చెప్పు అంటూ కంగారుగా రియాక్ట్ అయ్యారు. 
 

కాసేపు ఆలోచించి ట్విస్ట్ ఇచ్చాడు గోపీచంద్‌. త్రిష కోసం గొడవ పడ్డామని, సినిమాలో తామిద్దరి హీరోయిన్‌ త్రిష కోసం కొట్టుకున్నామని చెప్పి నీరు గార్చాడు. దెబ్బకి ఊపిరి పీల్చుకున్నాడు డార్లింగ్‌. మావోడు ఎక్కడికో వెళ్లిపోయాడంటూ డార్లింగ్‌ కామెంట్‌ చేయడం విశేషం. ఇది ఆద్యంతం నవ్వులు పూయించింది. బాలకృష్ణ షోలో ఇది హైలైట్‌గా నిలిచింది.

ఈ చిన్న క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం గోపీచంద్‌ `విశ్వం` చిత్రంలో నటిస్తున్నారు. ఈ దసరాకి ఈ మూవీ విడుదల కాబోతుంది. ప్రభాస్‌ `ది రాజా సాబ్‌`, హను రాఘవపూడి మూవీవ్‌ చేస్తున్నారు. అనంతరం `స్పిరిట్‌`, `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాలు చేయాల్సి ఉంది. 
 

Latest Videos

click me!