బిగ్గెస్ట్ వరల్డ్ రియాలిటీ షో గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షో బిగ్ బాస్. ఇక ఈ బిగ్ బాస్ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషలలో ప్రారంభం కాగా పలు సీజన్ లను కూడా పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం కొత్త సీజన్ లతో ప్రసారమవుతుంది. ఇక ఇటీవలే తెలుగులో సీజన్ 5 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక హిందీలో కూడా సీజన్ 15 ప్రారంభం కానుంది. ఇందులో సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ కు సంబంధించిన ప్రోమోలు కూడా విడుదలయ్యాయి. ఇదిలా ఉంటే ఇందులో రియా చక్రవర్తి తో సహా మరో 10 మంది సెలబ్రెటీలు ఈ షోను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంతకు వాళ్ళు ఎవరు అంటే..