అలా రాజేంద్రప్రసాద్ వద్ద మైమ్ అండ్ మూమెంట్‌లో చిరంజీవి శిక్షణ తీసుకున్నారు. రాజేంద్రప్రసాద్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఏడాదికి చిరు ఎంట్రీ ఇచ్చాడు. కానీ ప్రారంభం నుంచే జోరు చూపించాడు చిరు.
తక్కువ సమయంలోనే మాస్, కమర్షియల్ హీరోగా ఎదిగాడు. కానీ రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా, కామెడీ తరహా పాత్రలతో మెప్పించాడు. ఈ క్రమంలో చిరు సూపర్ స్టార్‌గా రాణిస్తున్న సమయంలో ఆయన సినిమాల్లోనే ఫ్రెండ్‌గా, సెకండ్ హీరోగా కనిపించారు నటకిరీటి.