తెరవెనుక ఆ డైరెక్టర్, తన కుమార్తె సుస్మితతో కలిసి చిరంజీవి భారీ ప్లాన్.. టాలీవుడ్ చరిత్రలో ఇదే తొలిసారి

Published : Jan 30, 2026, 07:03 AM IST

మన శంకర వరప్రసాద్ గారు మూవీ విజయం తర్వాత చిరంజీవి అద్భుతమైన ప్లాన్ వేశారు. ఓ దర్శకుడు, కుమార్తె సుస్మితతో కలసి ఆ ప్లాన్ ని చిరంజీవి అమలు చేయబోతున్నారు. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ టాలీవుడ్ లో రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ సృష్టించింది. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అయింది. సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడ్డారు. ఫలితంగా 350 కోట్లకు పైగా గ్రాస్ తో ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది. చిరంజీవి వింటేజ్ లుక్స్, పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు.

25
చిరంజీవి నెక్స్ట్ మూవీ ఇదే

మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఇచ్చిన జోష్ లో చిరంజీవి తన కొత్త ప్రాజెక్ట్స్ కి రెడీ అవుతున్నారు. చిరంజీవి నెక్స్ట్ మూవీ బాబీ దర్శకత్వంలో ఉండబోతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు దుబాయ్ లో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి నుంచి మరో ఆసక్తికర ప్రకటన కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది సినిమా ప్రకటన కాదు.

35
కూతురు సుస్మితతో క్రేజీ ప్లాన్

చిరంజీవి త్వరలో సొంతంగా ఓ పాడ్ కాస్ట్ ప్రారంభించబోతున్నారట. ఈ పాడ్ కాస్ట్ లో తన 40 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎదురైన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలని చిరంజీవి ఈ పాడ్ కాస్ట్ లో అభిమానుల కోసం వివరించబోతున్నారు. ఈ పాడ్ కాస్ట్ కి తెరవెనుక ప్లాన్ చేస్తున్నది దర్శకుడు, రచయిత బివిఎస్ రవి. సుస్మిత కొణిదెల కూడా ఈ ప్లానింగ్ లో భాగం అవుతున్నారు.

45
తెరవెనుక ఆ డైరెక్టర్

చిరంజీవి తన కెరీర్ గురించి వివరిస్తే ఆ అనుభవాలు అభిమానులకు, ఇండస్ట్రీలోకి రావాలని కలలు కంటున్న యువతకు బాగా ఉపయోగపడతాయి అని సుస్మిత భావిస్తున్నారు. అందుకే బివిఎస్ రవితో కలసి ఈ ప్లాన్ చేస్తున్నారు. ఇది కనుక జరిగితే టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర అవుతుంది.

55
తొలి హీరోగా సరికొత్త చరిత్ర

సొంతంగా పాడ్ కాస్ట్ ప్రారంభించిన తొలి హీరోగా చిరంజీవి రికార్డ్ సృష్టిస్తారు. అదే విధంగా తన కెరీర్ పై డాక్యుమెంటరీ చేయాలనే ఆసక్తి కూడా కొందరికి ఉన్నట్లు చిరంజీవి తెలిపారు. తన తదుపరి చిత్రం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ అని చిరు పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories