ఒకే సినిమాలో ముగ్గురు ప్రభాస్ హీరోయిన్లు.. ఒకరిని మించేలా మరొకరు, రెమ్యునరేషన్స్ లో తీవ్ర పోటీ

Published : Jan 29, 2026, 10:56 PM IST

Shahid Kapoor O Romeo Movie: విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వస్తున్న 'ఓ రోమియో' సినిమా 2026 ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రానుంది. షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటించడం, ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

PREV
13
ఓ రోమియో

ఈ సినిమాలో షాహిద్ కపూర్ 'ఉస్తారా' అనే కిరాయి హంతకుడిగా నటిస్తున్నాడు. అతను 'అఫ్షా' (తృప్తి డిమ్రి) అనే అమాయక యువతితో ప్రేమలో పడతాడు. వారి కథ ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో సాగుతుంది.

23
అవినాష్ తివారీ విలన్‌

అవినాష్ తివారీ విలన్‌గా, తమన్నా భాటియా కీలక పాత్రలో నటిస్తున్నారు. దిశా పటానీ డాన్సర్‌గా, నానా పటేకర్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. వీరి పాత్రలు కథకు బలం చేకూరుస్తాయి.

33
ముగ్గురు ప్రభాస్ హీరోయిన్లు

షాహిద్ కపూర్ రూ. 45 కోట్లు, తృప్తి డిమ్రి రూ. 6 కోట్లు, అవినాష్ తివారీ, తమన్నా రూ. 7 కోట్ల చొప్పున పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. దిశా పటానీకి రూ. 2 కోట్లు, నానా పటేకర్ కు రూ. 4 కోట్లు. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ మూవీలో ముగ్గురు ప్రభాస్ హీరోయిన్లు ఉన్నారు. తమన్నా, దిశా పటాని ఇద్దరూ ప్రభాస్ తో నటించిన వారే. ఇప్పుడు తృప్తి డిమ్రి కూడా ప్రభాస్ తో స్పిరిట్ చిత్రంలో నటిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories