2026 ఏడాది టాలీవుడ్ కి బాగానే కలసి వస్తోంది. ఈ 8 నెలల టైంలో చెప్పుదగ్గ విజయాలు, సూపర్ హిట్స్ చాలానే ఉన్నాయి. అయితే ఈ ఏడాది కంబ్యాక్ ఇచ్చిన హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిరంజీవి నుంచి రవితేజ వరకు చాలా మంది హీరోలు, నటీమణులు సూపర్ హిట్ చిత్రాలతో మాస్ కంబ్యాక్ ఇచ్చారు. చిరంజీవి ఈ ఏడాది ఆరంభవంలో సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించారు. రవితేజ ఇరుముడి మూవీతో ఆ మెరుపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫ్లాపుల నుంచి ఈ ఏడాది గట్టెక్కిన హీరోల, వారి సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.