చిరంజీవి హీరోగా ఎదుగుతున్న సమయంలో ఎన్నో సవాళ్ళని అధికమిస్తూ అవకాశాలు అందుకున్నారు. అయితే చిరంజీవిని ఆ టైంలో ఎవరూ టార్గెట్ చేయలేదా అనే ప్రశ్నకు పున్నమినాగు మూవీలో నటించిన నరసింహరాజు సమాధానం ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో చిన్న పాత్రల్లో నటిస్తూ గుర్తింపు పొందారు. ఆ తర్వాత నెమ్మదిగా డ్యాన్సులు, ఫైట్స్ లో తన ప్రతిభ చాటుకున్నారు. దీనితో నిర్మాతల దృష్టిలో పడ్డారు. ఆ విధంగా చిరంజీవికి ఇండస్ట్రీలో అవకాశాలు దక్కాయి. ఏ ఇండస్ట్రీలో అయినా ప్రతిభావంతులు పాలిటిక్స్ వల్ల వెనుకబడిపోతుంటారు లేదా అణచివేయబడుతుంటారు అనే మాటలు వినిపిస్తుంటాయి.
25
చిరంజీవిని తొక్కాలని ప్రయత్నించారా ?
టాలీవుడ్ లో కూడా తరచుగా అలాంటి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే చిరంజీవి ఎదుగుతున్న సమయంలో అతడిని అణచివేయాలని ఎవరైనా ప్రయత్నించారా ? ఈ ప్రశ్నకు పున్నమి నాగు చిత్రంలో హీరోగా నటించిన నరసింహ రాజు సమాధానం ఇచ్చారు. ఈ మూవీలో చిరంజీవి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించిన సంగతి తెలిసిందే.
35
చిరంజీవిని ఎవరూ అడ్డుకోలేకపోయారు
చిరంజీవిని ఎవరైనా అణచివేయడానికి ప్రయత్నించారా లేదా అనేది నాకు తెలియదు. కానీ తీవ్రమైన కాంపిటీషన్ మాత్రం ఉండేది. ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ చిరంజీవిని ఎవరూ అడ్డుకోలేకపోయారు. ఎందుకంటే సినిమా అనేది వ్యాపారం. వ్యాపారంలో ప్రతిభ, సక్సెస్ మాత్రమే పనిచేస్తాయి. అప్పటికే చిరంజీవి ప్రతిభ ఏంటో అందరికీ తెలిసింది. సక్సెస్ కూడా వచ్చేసింది.
దీనితో చిరంజీవిని ఆపడం ఎవరి వల్లా కాలేదు. వీటన్నింటికి తోడు చిరంజీవి బిహేవియర్ చాలా బావుంటుంది. ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత సక్సెస్ ఉన్న బిహేవియర్ బాగలేకపోతే కచ్చితంగా అణచివేసేవాళ్ళు. చిరంజీవి తన ప్రతిభ, సక్సెస్ తో పాటు బిహేవియర్ కూడా రక్షణ కవచంలా నిలిచింది అని నరసింహరాజు అన్నారు.
55
ఖైదీతో క్రేజ్
నరసింహరాజు, చిరంజీవి కలసి పునాదిరాళ్ళు సినిమాలో కూడా నటించారు. పున్నమి నాగు, పునాదిరాళ్లు, మనవూరి పాండవులు లాంటి సినిమాల్లో నటిస్తూ ఖైదీ చిత్రంతో చిరంజీవి తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు