చిరంజీవితో డాన్స్ ల్లో ఓ హీరోయిన్ గట్టి పోటీ ఇచ్చేదట. ఆమె కాంపిటీషన్‌గా భావించి చేసేదట. ఆమె తీరుని చూసిన చిరంజీవి స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. ఓపెన్‌గానే అసలు విషయం చెప్పారట.
`మన శంకర వర ప్రసాద్ గారు`తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే బ్లాక్ బస్టర్ ని అందుకుని స్ట్రాంగ్‌గా బౌన్స్ బ్యాక్ అయ్యారు. `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో రీజినల్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఏకంగా దాదాపు రూ.290కోట్లు వసూలు చేసింది. రీజనల్ మూవీస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మరో కొత్త మూవీకి రెడీ అవుతున్నారు. బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. మార్చి చివర్లోగానీ, ఏప్రిల్‌లోగానీ మూవీ ప్రారంభం కానుంది.
25
భుజం సర్జరీపై చిరంజీవి అప్ డేట్
తాజాగా చేతికి గాయంతో కనిపించారు చిరంజీవి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వివరణ ఇచ్చారు. చిన్న భుజానికి కీ హోల్ సర్జరీ జరిగిందని, ఇప్పుడు బాగానే ఉన్నట్టు తెలిపారు. క్రమంగా కోలుకుంటున్నానని, తిరిగి రెగ్యూలర్ దిన చర్యకి వస్తున్నట్టు చెప్పారు. అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన నితిన్ కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు చిరు. ఈ సర్జరీ ఈజీగా, సింపుల్‌గా చేయడంలో ఆయన ఎంతో కేర్ తీసుకున్నారని, తన ప్రతిభని చూపించారని తెలిపారు. ఈ విషయంలో ఆందోళన చెందుతూ, తనపై ప్రేమని వ్యక్తం చేస్తూ ఆశీర్వాదాలు ఇస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి.
35
డాన్స్ లో చిరంజీవికి కాంపిటీషన్ ఇచ్చిన హీరోయిన్
ఈ క్రమంలో తాజాగా చిరంజీవి ఓల్డ్ ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ భాను ప్రియ గురించి తెలిపారు. ఆమె అద్బుతమైన డాన్సర్ అని, ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ డాన్సర్లతో ఆమె ఒకరు అని తెలిపారు. ఆమెతో కలిసి నటించడం అద్బుతమైన అనుభవమని చెప్పారు. తనతో డాన్స్ చేయడం చాలా టఫ్‌గా ఉండేదని, మిగిలిన హీరోయిన్లతో ఈజీగా డాన్స్ చేసేవారట. కానీ భానుప్రియతో కష్టపడాల్సి వచ్చేదని తెలిపారు చిరంజీవి.
ఈ క్రమంలో భానుప్రియకి ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ని రివీల్ చేశారు చిరు. భానుప్రియ డాన్స్ విషయంలో కాంపిటీషన్‌గా భావించేదట. తనతో పోటీగా చేసేదట. కానీ ఈ క్రమంలో తమ మధ్య కెమిస్ట్రీ, ఆ రొమాన్స్ మిస్ అయ్యేదట. పాటల్లో డాన్స్ చేస్తే ఏదో కాంపిటీషన్‌లో పాల్గొన్నట్టుగానే ఉండేదని, కానీ ఆ డాన్స్ ని, కెమిస్ట్రీని, రొమాన్స్ ని ఎంజాయ్ చేసేవాళ్లం కాదని తెలిపారు. దీంతో ఆమెకి తన మనసులో మాట చెప్పేశారట. ఇలా పోటీగా డాన్స్ చేస్తున్నారు తప్పితే, కెమిస్ట్రీ పండటం లేదు, డాన్స్ ని ఆస్వాధించడం లేదు, తెరపై చూస్తే అది బాగుండదని చెప్పారట. దీంతో చిరంజీవి చెప్పిన సలహాని భాను ప్రియ కూడా పాజిటివ్‌గా తీసుకుని ఆ రకంగా తన డాన్సు ని మార్చుకునే ప్రయత్నం చేసిందట. ఆ తర్వాత నుంచి తనతో డాన్స్ ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేసినట్టు తెలిపారు చిరంజీవి. మంచు లక్ష్మీతో టాక్ షోలో చిరు ఈ విషయాన్ని తెలిపారు.
55
చిరంజీవి చెప్పింది ఒప్పుకున్న భానప్రియ
అయితే ఈ విషయాన్ని భానుప్రియ కూడా ఒప్పుకుంది. చిరంజీవితో రొమాన్స్ ని ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని అని తెలిపారు. తన దృష్టి మొత్తం డాన్స్ బాగా చేయాలనే దానిపైనే ఉండేదని, దాని కారణంగానే రొమాన్స్ మీద ఫోకస్ పెట్టలేకపోయానని, ఆ వెలితి ఉంటుందని చెప్పింది. చిరంజీవి కూడా ఈ విషయాన్ని చెప్పేవారని తెలిపింది భానుప్రియ. గతంలో ఓ ఇంటర్వ్యూలో భానుప్రియ వెల్లడించారు.